మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews
31 అక్టోబర్ 2025
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసులు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను సన్మానించారు.
మాదాపూర్‌లోని టి-హబ్ గేట్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సైబరాబాద్ పోలీసులు “ఏక్తా దివాస్ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఫిట్నెస్,సామరస్యం. సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి మనం కలిసి రండి” అనే థీమ్‌తో 2 కిలోమీటర్ల “రన్ ఫర్ యూనిటీ” నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని. రితిరాజ్, ఐపీస్, డీసీపీ మాదాపూర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ ఎడిసిపి ఉదయ్ రెడ్డి, ఎసిపి సిహెచ్. శ్రీధర్, మియాపూర్ ఏసీపీ సీహెచ్. వై. శ్రీనివాస్ కుమార్, మాదాపూర్ జోన్ ఇన్స్పెక్టర్లు, పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews
150 వ జయంతి సందర్భంగా పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు... బిజెపి నేత కొత్తపల్లి పద్మ.
భారత మాజీ ఉప ప్రధాని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను శుక్రవారం ఫతే మైదాన్ బషీర్‌బాగ్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి పరువు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రంగారెడ్డి జిల్లా నాయకురాలు కొత్తపల్లి పద్మ మాట్లాడుతూ భారతదేశానికి మాజీ ఉప ప్రధాని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. వేలాది మంది మహిళా కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో అన్ని కులాల వారికి న్యాయం జరిగే చట్టాలను అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు, ఉమ్మడి రాష్ట్రాలను సైతం లెక్కచేయకుండా అభివృద్ధి తన లక్ష్యంగా భావించారు.
జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీలలో ప్రచారాన్ని వేగవంతం చేశారు, కాంగ్రెస్ టిఆర్ఎస్ కంటే భారతీయ జనతా పార్టీ ప్రచారంలో నిమగ్నమయ్యారు, కిరాణా షాపులు, ఇండ్లలోకి వెళ్లి మహిళలకు పూసగుచ్చినట్లు కమలం గుర్తుకు ఓటు వేయాలని, అలాంటి సమయంలో బిజెపి మనకు అహర్నిశల అందుబాటులో ఉంటుందని కొత్తపల్లి పద్మ తెలిపారు, ఏ ఇంటికి ప్రచారానికి వెళ్లిన మహిళలకు పూసగుచ్చినట్లు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఓటర్లకు గుర్తుండేలా చెబుతున్నారు,
29 అక్టోబర్ 2025
జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం... బిజెపి సీనియర్ నాయకురాలు కొత్తపల్లి పద్మ..
జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం... బిజెపి సీనియర్ నాయకురాలు కొత్తపల్లి పద్మ..
జూబ్లీహిల్స్ ఎన్నికలలో భాగంగా బిజెపి అభ్యర్థి లంకల దీపక్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని బిజెపి సీనియర్ నాయకురాల్లో కొత్తపల్లి పద్మ తెలిపారు. రాజేంద్రనగర్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజెపి అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాడని భీమా వ్యక్తం చేశారు. ఎండ వానను సైతం లెక్కచేయకుండా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి.
#telugunews #telugufocustv #telugufocustvnews
27 అక్టోబర్ 2025
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది,
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఈ అభివృద్ధిని కొనసాగించేలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఆదివారం మధురానగర్ డివిజన్లో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు.ఆయనతోపాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు స్థానిక నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ అండగా ఉంటుందని వారి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కార్యకర్తలు నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

22 అక్టోబర్ 2025
సైబరాబాద్ పోలీస్, ఎస్సి ఎస్సి సైబరాబాద్ సీపీవోలో మెగా రక్తదాన శిబిరం...653 యూనిట్ల రక్తం సేకరణ.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా, రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తో కలిసి బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మెడికోవర్ హాస్పిటల్స్. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో “రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి” అనే నినాదంతో జరిగింది ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. మేడ్చల్ డీసీపీ ఎన్ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, ఐపీఎస్ తదితరులు రక్తదానం చేశారు.
17 అక్టోబర్ 2025
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న బీసీ నేతలు శేరిలింగంపల్లి.
ఈనెల 18వ తేదీన బీసీ నాయకులు సంఘటితమై బందుకు సహకరించాలని రంగారెడ్డి జిల్లా. శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరామచంద్రర్ యాదవ్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం చందానగర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కోమీరి శెట్టి సాయిబాబా. రంగారెడ్డి జిల్లా సగర సంగం అధ్యక్షులు శేఖర సా రంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు శేఖర సగర. శేరిలింగంపల్లి 106 డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. బీసీ నాయకులు సుప్రజా ప్రవీణ్. రామకృష్ణ. భక్తరాజు. లతోపాటు. అనంతరం బీసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ శనివారం నిర్వహించే బందుకు అన్ని సంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు.
Sr Reproter Raju
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి.
#telugunews #telugufocustv #telugufocustvnews
28 జనవరి 2025
ఫిబ్రవరి 3న ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్
ఫిబ్రవరి 3న ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో టీం గేర్ పెంచేసింది. రీసెంట్గా రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన అసలు సిసలు అప్డేట్ రాబోతోంది. ఈ మేరకు చిత్రయూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఫిబ్రవరి 3న డార్లింగ్ ప్రభాస్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రభాస్‌ను అలా కొద్దిగా చూపించి ఊరించారు. ఈ పోస్టర్‌లోని త్రిశూలం, ప్రభాస్ చూపులు, నుదుట విబూదిని చూస్తుంటే ఈ లుక్ కన్పప్ప చిత్రానికే హైలెట్‌గా నిలిచేలా ఉంది.
కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ఆడియెన్స్ ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇలా ఎంతో మంది భారీ తారాగణం నటించింది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి.
#telugunews #telugufocustv #telugufocustvnews #prabhas #kanappamovie #kannappamovieprabhaslook #prabhasnewmovie #prabhasfans #prabhaslook
27 జనవరి 2025
బ్రహ్మ ఆనందం’ నుంచి సెకండ్ సింగిల్ ‘విలేజ్ సాంగ్’ విడుదల
బ్రహ్మ ఆనందం’ నుంచి సెకండ్ సింగిల్ ‘విలేజ్ సాంగ్’ విడుదల
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి చేతుల మీదుగా ప్రముఖ సంస్థ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై యూనిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘బ్రహ్మ ఆనందం’ నుంచి సెకండ్ సింగిల్ ‘విలేజ్ సాంగ్’ విడుదల
మళ్ళి రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకుంది. హ్యాట్రిక్ హిట్ల తరువాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ‘బ్రహ్మ ఆనందం’ అనే చిత్రంతో వస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌కి ఇది నాలుగో ప్రాజెక్ట్. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ‘బ్రహ్మ ఆనందం’ టీజర్ అందరినీ నవ్విస్తూనే గుండెకు హత్తుకునే ఎమోషన్స్‌ను చూపించింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ను పెంచేశారు.
ఇందులో భాగంగా 'విలేజ్ సాంగ్' అనే రెండో పాటను సోమవారం నాడు మేకర్లు రిలీజ్ చేశారు. ఈ పాటను ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు. ఈ పాటకు శాండిల్య పిసాపాటి బాణీ అందరినీ హత్తుకునేలా ఉంది. సురేష్ బనిశెట్టి రాసిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే బ్రహ్మానందం, రాజా గౌతమ్ మధ్య సన్నివేశాల్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. రామ్ మిరియాల గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఆయన గాత్రంలో ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనే కుతుహాలాన్ని పెంచేస్తోంది.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. శాండిల్య పిసాపాటి సంగీతం సమకూర్చగా, మితేష్ పర్వతనేని కెమెరా మెన్‌గా, ప్రణీత్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.
నటీనటులు :
రాజా గౌతమ్, "పద్మశ్రీ" బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
దర్శకుడు: Rvs నిఖిల్
DOP: మితేష్ పర్వతనేని
సంగీత దర్శకుడు: శాండిల్య పిసపాటి
ఎడిటర్: ప్రణీత్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.వంశీకృష్ణా రెడ్డి, పి.దయాకర్ రావు

#telugufocustv #telugunews #bramhanandammovie #filmnews #cinema #bramhanandammovie
త్వరలో విడుదలకు సిద్దమవుతున్న “మిస్టీరియస్”
త్వరలో విడుదలకు సిద్దమవుతున్న “మిస్టీరియస్”
మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “మిస్టీరియస్” (MissTerious) తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్, అబిద్ భూషణ్ ( నాగభూషణం మనవడు), రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్), రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ఉష మరియు శివాని సమర్పణలో ఆష్లీ క్రియేషన్స్ (Ashley Creations) బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి మరియు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది, ఆడియో లాంచ్ త్వరలో షెడ్యూల్ చేయబడుతుంది.దర్శకుడు మహి కోమటి రెడ్డి మాట్లాడుతూ మిస్టీరియస్ చిత్రం ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా నిర్మించాము. చిత్రకథ మరియు స్క్రీన్ ప్లే సునిశితంగా రూపొందించిన ఈ చిత్రం క్రమక్రమంగా క్లూలను బహిర్గతం చేస్తూ ప్రేక్షకులను చివరి వరకు ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ చిత్రం షాకింగ్ ట్విస్ట్ లు కథను కొత్త ఎత్తులకు తీసుకెల్లి వీక్షకులను రంజింప చేస్తుంది, యాక్షన్స్, థ్రిల్లింగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి అని వివరించారు.
మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం ప్రత్యేకం అని అన్నారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ తర్వాత త్వరలో విడుదల కానుంది.
చిత్రాన్ని ఉన్నత విలువలతో రూపొందించడానికి అన్ని విధాలుగా సహకారం అందించిన నిర్మాతను ఆయన అభినందించారు.
నిర్మాత జయ్ వల్లందాస్ (USA) మాట్లాడుతూ, ఎక్కడ రాజీ పడకుండ నిర్మిస్తున్న ఈ సినిమాలో మూడు మంచి పాటలు ఉన్నాయని, సంగీత దర్శకుడు M.L రాజా మధురమైన సంగీతాన్ని అందించారని త్వరలోనే ఆడియోను రిలీజ్ చేస్తామని చెప్పారు. క్లైమాక్స్ వరకు ఉత్కంఠను నింపడం ఈ చిత్రం మాస్టర్ క్లాస్ అని అన్నారు.మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం ప్రత్యేకం అని అన్నారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ తర్వాత త్వరలో విడుదల కానుంది.
నటీనటులు : ప్రధాన తారాగణం:
రోహిత్ (బిగ్ బాస్ ఫేమ్), రియా కపూర్ (హీరోయిన్), అబిద్ భూషణ్ (ప్రముఖ నటుడు రక్త కన్నీరు నాగభూషణ్ మనవడు), మేఘనా రాజపుత్ (హీరోయిన్), బలరాజ్ వాడి (కన్నడ నటుడు), ఆకునూరి గౌతమ్,భోగిరెడ్డి శ్రీనివాస్, రాజమౌళి(జబర్దస్త్), గడ్డం నవీన్ (జబర్దస్త్), లక్ష్మి,,వేణు పోల్సాని
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహి కోమటిరెడ్డి
నిర్మాత: జయ్ వల్లందాస్ (USA)
పాటలు మరియు సంగీతం: ML రాజా
కెమెరా & ఎడిటింగ్: పరవస్తు దేవేంద్ర సూరి (దేవా)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్ ఉప్పు
పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి.

#telugufocustvnews #telugunews #MissTerious #MissTeriousmovie #filmnews
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదగా రమేష్ స్టూడియోస్ ఘన ప్రారంభం
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదగా రమేష్ స్టూడియోస్ ఘన ప్రారంభం
ఈరోజు మణికొండలోని ఓయూ కాలనీలో రమేష్ స్టూడియోస్ ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం సంపూర్ణ సూపర్ మార్కెట్ పైన రమేష్ స్టూడియోస్ ఏర్పాటు ప్రారంభించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ రమేష్ స్టూడియోస్ ను అలాగే డిఐ సూట్ ఓపెన్ చేయడం జరిగింది. తెలుగు చిత్ర నిర్మాత మండలి ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా డబ్బింగ్ థియేటర్ ప్రారంభించడం జరిగింది. ఆలేరు ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ అయిన బీర్ల ఐలయ్య గారి చేతుల మీదగా ఎడిటింగ్ రూమ్ ఓపెన్ కావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి గారి చేతుల మీదగా రెండవ సెకండు సూట్ ఓపెన్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర గారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ & చత్రపురి ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు, నల్గొండ డిసిఎంఎస్ చైర్మన్ బొల్లా వెంకట రెడ్డి గారు, ఇంకా పలువురు కౌన్సిలర్స్ అలాగే సినీ ప్రముఖులు పాల్గొని రమేష్ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
#telugufocustv #telugunews #komatireddyvenkatreddy #telugunews #telangananews
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)