28 జనవరి 2025
ఫిబ్రవరి 3న ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్
27 జనవరి 2025
బ్రహ్మ ఆనందం’ నుంచి సెకండ్ సింగిల్ ‘విలేజ్ సాంగ్’ విడుదల
బ్రహ్మ ఆనందం’ నుంచి సెకండ్ సింగిల్ ‘విలేజ్ సాంగ్’ విడుదల
మళ్ళి రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకుంది. హ్యాట్రిక్ హిట్ల తరువాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు ‘బ్రహ్మ ఆనందం’ అనే చిత్రంతో వస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌కి ఇది నాలుగో ప్రాజెక్ట్. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ‘బ్రహ్మ ఆనందం’ టీజర్ అందరినీ నవ్విస్తూనే గుండెకు హత్తుకునే ఎమోషన్స్‌ను చూపించింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ను పెంచేశారు.
ఇందులో భాగంగా 'విలేజ్ సాంగ్' అనే రెండో పాటను సోమవారం నాడు మేకర్లు రిలీజ్ చేశారు. ఈ పాటను ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు. ఈ పాటకు శాండిల్య పిసాపాటి బాణీ అందరినీ హత్తుకునేలా ఉంది. సురేష్ బనిశెట్టి రాసిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే బ్రహ్మానందం, రాజా గౌతమ్ మధ్య సన్నివేశాల్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. రామ్ మిరియాల గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఆయన గాత్రంలో ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనే కుతుహాలాన్ని పెంచేస్తోంది.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. శాండిల్య పిసాపాటి సంగీతం సమకూర్చగా, మితేష్ పర్వతనేని కెమెరా మెన్‌గా, ప్రణీత్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.
నటీనటులు :
రాజా గౌతమ్, "పద్మశ్రీ" బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
దర్శకుడు: Rvs నిఖిల్
DOP: మితేష్ పర్వతనేని
సంగీత దర్శకుడు: శాండిల్య పిసపాటి
ఎడిటర్: ప్రణీత్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.వంశీకృష్ణా రెడ్డి, పి.దయాకర్ రావు
త్వరలో విడుదలకు సిద్దమవుతున్న “మిస్టీరియస్”
త్వరలో విడుదలకు సిద్దమవుతున్న “మిస్టీరియస్”
మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “మిస్టీరియస్” (MissTerious) తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్, అబిద్ భూషణ్ ( నాగభూషణం మనవడు), రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్), రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ఉష మరియు శివాని సమర్పణలో ఆష్లీ క్రియేషన్స్ (Ashley Creations) బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి మరియు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది, ఆడియో లాంచ్ త్వరలో షెడ్యూల్ చేయబడుతుంది.చిత్రాన్ని ఉన్నత విలువలతో రూపొందించడానికి అన్ని విధాలుగా సహకారం అందించిన నిర్మాతను ఆయన అభినందించారు.
నిర్మాత జయ్ వల్లందాస్ (USA) మాట్లాడుతూ, ఎక్కడ రాజీ పడకుండ నిర్మిస్తున్న ఈ సినిమాలో మూడు మంచి పాటలు ఉన్నాయని, సంగీత దర్శకుడు M.L రాజా మధురమైన సంగీతాన్ని అందించారని త్వరలోనే ఆడియోను రిలీజ్ చేస్తామని చెప్పారు. క్లైమాక్స్ వరకు ఉత్కంఠను నింపడం ఈ చిత్రం మాస్టర్ క్లాస్ అని అన్నారు.మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం ప్రత్యేకం అని అన్నారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ తర్వాత త్వరలో విడుదల కానుంది.
రోహిత్ (బిగ్ బాస్ ఫేమ్), రియా కపూర్ (హీరోయిన్), అబిద్ భూషణ్ (ప్రముఖ నటుడు రక్త కన్నీరు నాగభూషణ్ మనవడు), మేఘనా రాజపుత్ (హీరోయిన్), బలరాజ్ వాడి (కన్నడ నటుడు), ఆకునూరి గౌతమ్,భోగిరెడ్డి శ్రీనివాస్, రాజమౌళి(జబర్దస్త్), గడ్డం నవీన్ (జబర్దస్త్), లక్ష్మి,,వేణు పోల్సాని
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహి కోమటిరెడ్డి
నిర్మాత: జయ్ వల్లందాస్ (USA)
పాటలు మరియు సంగీతం: ML రాజా
కెమెరా & ఎడిటింగ్: పరవస్తు దేవేంద్ర సూరి (దేవా)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్ ఉప్పు
పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదగా రమేష్ స్టూడియోస్ ఘన ప్రారంభం
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదగా రమేష్ స్టూడియోస్ ఘన ప్రారంభం
ఈరోజు మణికొండలోని ఓయూ కాలనీలో రమేష్ స్టూడియోస్ ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం సంపూర్ణ సూపర్ మార్కెట్ పైన రమేష్ స్టూడియోస్ ఏర్పాటు ప్రారంభించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ రమేష్ స్టూడియోస్ ను అలాగే డిఐ సూట్ ఓపెన్ చేయడం జరిగింది. తెలుగు చిత్ర నిర్మాత మండలి ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా డబ్బింగ్ థియేటర్ ప్రారంభించడం జరిగింది. ఆలేరు ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ అయిన బీర్ల ఐలయ్య గారి చేతుల మీదగా ఎడిటింగ్ రూమ్ ఓపెన్ కావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి గారి చేతుల మీదగా రెండవ సెకండు సూట్ ఓపెన్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర గారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ & చత్రపురి ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు, నల్గొండ డిసిఎంఎస్ చైర్మన్ బొల్లా వెంకట రెడ్డి గారు, ఇంకా పలువురు కౌన్సిలర్స్ అలాగే సినీ ప్రముఖులు పాల్గొని రమేష్ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
దళపతి విజయ్ సెన్సేషనల్ మూవీ టైటిల్ ‘జన నాయగన్
కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న దళపతి విజయ్ సెన్సేషనల్ మూవీ టైటిల్ ‘జన నాయగన్'
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చేస్తున్న చివరి సినిమా మీద అంచనాలు భారీ స్తాయిలో నెలకొన్నాయి. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రారంభించారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.‘జన నాయగన్’ అనే టైటిల్‌తో దళపతి విజయ్ చివరి చిత్రం రాబోతోంది. ఈ టైటిల్ పోస్టర్‌లో దళపతి విజయ్ ఎంతో స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌లోని సెల్ఫీకి, ఆ టైటిల్‌కి న్యాయం చేసినట్టుగా కనిపిప్తోంది. ఈ మూవీని విజయ్‌కి ఫేర్ వేల్‌గా ఉండబోతోంది. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుంది.
జన నాయగన్ అనే మూవీ టైటిల్ అర్థం అందరికీ తెలిసిందే. జన నాయకుడు.. పీపుల్స్ లీడర్.. ప్రజా నాయకుడు అని అర్థం వస్తుంది. ఇన్నేళ్లలో విజయ్ చేసిన సేవా కార్యక్రమాలు, సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు చిహ్నంగా ఈ టైటిల్ ఉంది. ఈ చిత్రంతో అనిరుధ్ మరోసారి తన సంగీతంతో విజయ్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు సిద్దంగా ఉన్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. అదిరిపోయే లైనప్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ మున్ముందు మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించనుంది.
ఈ విజయం ప్రేక్షకులదే: బాక్సాఫీస్ సంబరం ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ భీమవరంలో బాక్సాఫీస్ సంబరం ఈవెంట్ నిర్వహించింది. భారీగా హాజరైన అభిమానులు ప్రేక్షకులు సమక్షంలో ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మల్యే కామినేని శ్రీనివాసరావు ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. హలో భీమవరం. అందరికీ బిగ్ థాంక్స్. బీమ్స్ గోదారి గట్టు పాట ఈ సినిమా సందడి మొదలైయింది. ఈ సినిమా పెద్ద హిట్ అయితే చాలు అనుకున్నాం. కానీ సినిమాని మీరు ఎక్కడితో తీసుకెళ్ళి పెట్టారు. ఇంత పెద్ద విజయాన్ని ఆడియన్స్ కి బిగ్ థాంక్ యూ. ఎస్విసి బ్యానర్ నా ఫ్యామిలీ. ఇది వారితో ఆరో సినిమా. దిల్ రాజు గారికి శిరీష్ గారికి థాంక్ యూ. టీం అందరికీ థాంక్ యూ. మా విక్టరీ వెంకటేష్ గారికి చాలా థాంక్. ఈ సినిమా క్రెడిట్ ఆయనే దక్కుతుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. నేను వెంకటేష్ గారి అభిమానిని. ఆయన సినిమాకు చూసి విజల్స్ వేశాను. ఆయనలా జుట్టుపెచుకున్నాను. ఆయన సినిమాకి డైరెక్టర్ చేయడం గ్రేట్ హానర్. థాంక్ యూ సార్. పద్మభూషణ్ అవార్డ్ అందుకొనున్న బాలయ్య గారికి మా సినిమా తరపున బిగ్ కంగ్రాట్స్. ఈ సంక్రాంతిని మర్చిపోలేను. మీ ఆశీస్సులతో కుదిరితే ఇంకో సంక్రాంతి వస్తా' అన్నారు
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ భీమవరంలో చేసుకోవడం ఆనందంగా వుంది. వెంకటేష్ గారి మిస్ అయ్యాను. ముఖ్యంగా ఫుడ్(నవ్వుతూ). దిల్ రాజు గారికి శిరీష్ గారికి థాంక్ యూ. అనిల్ గారికి బిగ్ థాంక్స్. ఈ విజయాన్ని మర్చిపోలేను' అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద సక్సెస్ ఫుల్ సినిమాలో నన్ను పార్ట్ చేసిన అనిల్ గారికి వెంకటేష్ గారికి దిల్ రాజు గారికి శిరీష్ గారికి థాంక్ యూ. ఈ సినిమాలో పాటలు రాసిన రచయితలకు థాంక్. ఇందులో పాటలు పాడిన సింగర్స్ కి ముఖ్యంగా వెంకటేష్ గారికి థాంక్ యూ. ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని చేసిన అందరికీ థాంక్' అన్నారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.




