27 అక్టోబర్ 2016

టీవీ,ఫోన్, ఇంటర్నేట్ ప్రభావం వల్ల నష్టాలు

మన జీవితాల్లో టీవీ, ఫోన్, ఇంటర్నెట్‌ చాలా ముఖ్యమైపోయింది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఎదైనా టికెట్ల బుకింగ్‌ ఇంటర్నెట్‌పైనే ఉంటేనే సాధ్యం, అలాంటి ఇంటర్నేట్ వాడాలంటే కంప్యూటర్,ల్యాప్ టాప్ ఉండాలి వాటికి డబ్బులు ఎక్కువ అవసరం కాబట్టి ప్రతివాళ్ళు మొబైల్ ఫోన్ తీసుకుని అందులోనే ఇంటర్నేట్ వాడుతున్నారు.ఇంటర్నెట్‌ వాడకం ప్రపంచ మొత్తం అనేక మార్పులు తీసుకువచ్చింది. అదే ముఖ్యంగా కుటుంబ సభ్యుల పక్కపక్కనే వున్నా వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాచింగ్, ఛాటింగ్‌, పోస్టింగ్‌, కామెంట్స్‌తోనే కాలం గడిపేస్తున్నాం. ఇంటర్నెట్‌ వాటకం ఒక వ్యసనంగా మారిపోయింది. దీని వల్ల ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని విశ్లేషకులు బావిస్తున్నారు.
ఇంటర్నెట్‌ డీ అడిక్షన్‌ క్లినిక్స్‌ - ఇంటర్నేట్ ఎక్కువగా వాడుతున్న నేపథ్యంలో దిల్లీలోని ఎయిమ్స్‌ తొలిసారిగా ఇంటర్నెట్‌ డీ అడిక్షన్‌ క్లినిక్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రంలో ఇంటర్నేట్ అనేది వ్యసనంగా మారిన వారికి ప్రతి శనివారం రోజున కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. 2 సంవత్సరాల ముందు పదోతరగతిలో టాపర్‌గా వున్న విద్యార్థి ఇంటర్నెట్‌ను అదేపనిగా వాడకం మొదలుపెట్టిన్నాడు.తరువాత అతను చదువులో ఏమాత్రం రాణించలేకపోయాడు. కారణం అతనికి ఏకాగ్రత, శ్రద్ద లేకపోవడమేనని అతని తల్లిదండ్రులు చెప్పారు. ఇంటర్నెట్‌ ను వాడటం మాన్పించేందుకు అనేక రకాల ప్రయత్నించిన ఆ విద్యార్థిలో ఎటువంటి మార్పులు తీసుకురాలేదు.దీంతో ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. వాళ్లకి తల్లిదండ్రులు నమ్మలేని నిజం ఒకటి చెప్పారు. అన్నదమ్ములిద్దరు ఇంటర్నేట్ చూస్తుండగా ఇంట్లోకి దొంగలు వచ్చి దొంగతనం చేసుకుని వెళ్తుంటే వారిని చూసి కూడ పట్టించుకోకుండా ఉండిపోయారట. చిన్న వయస్సులోనే పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం, టీవీ చూపించడం, ఇంటర్నేట్ వాడటం, లాంటివి కట్టడిచేయకపోతే పిల్లల్లో, పెద్దల్లోను అనేక సమస్యలకు దారి తీస్తుందని వైద్యనిపుణులు తెల్చి చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరు 6 నుండి 8 గంటలు నిద్ర తప్పని సరిగా ఉండాలి ఎంతోమంది రాత్రి 2,3 గంటల వరకు ఇంటర్నేట్ లోను, ఫోన్, టీవీ చూడటం లాంటివి చేస్తున్నారు. ఇటువంటివి తగ్గించి ముందు ముందు వచ్చె సమస్యలకు దూరంగా ఉండండి. ప్లీజ్ ఇది అందరికి షేర్ చెయ్యండి. 

చార్మినార్- గొల్కొండ కోట వెనుక స్టోరి

మనలో చాలా మందికి రహాస్యాలు అంటే చాలా ఇంట్రస్ట్ గా చూస్తాం, వింటాం, అలాంటిదే ఇప్పుడు ఒక రహస్యం చూద్దాం.సుమారు 400 సంవత్సర నుండి కుతుబ్ షాహిలా రాజ్యానికి రాజధానే గొల్కొండ కోట, ఈ గొల్కొండ కోట కాకతీయ్యుల కాలంలో క్రీ.శ 1143 నిర్మించారు.ఓరుగల్లుని పాలించిన ప్రభువు కృష్ణదేవ్ దీనిని క్రీ.శ 1363 లో బహమది సూల్తాన్ మొదటి మహ్మద్ షాకు అప్పగించారు. బహమనిరాజ్యం పతనం అవుతున్న సందర్భంలో సూల్తాన్ కులి కుథుబ్ షా క్రీ.శ 1518 లో స్వతంత్ర రాజై గొల్కొండను రాజధానిగా చేసుకుని పట్టాభిషేకం చేసుకున్నాడు.
తర్వాత ఇబ్రహిం కుతుబ్ షానా కాలంలో గొల్కొండ నగర జనాబా పెరిగిపోయింది.నీటి వసతులు సరగా లేకుండా అంటువ్యాధులు ప్రభలినాయి, పట్టణాన్ని విస్త్రతపరచడం కోసం మూసీనదిపైన పురానాపుల్ నిర్మించాడు.ఇబ్రహిం కుతుబ్ షా మరణించిన తర్వాత అతని కుమారుడు కులికుతుబ్ షా నూతన నగరం నిర్మించాలని మూసినది వడ్డున నిర్మించిన నగరమే భాగ్యనగరం(హైదరాబాద్). మూసినది నడ్డిన నిర్మించిన ఈ నగరాన్ని తన ప్రియురాలికి బాగ్ మతి  పేరుని పెట్టాడు. బాగ్యనగరం అని పిలిచాడు. ప్రపంచ సుందర నిర్మాణాలలో హైదరాబాద్ లోని ఛార్మినార్ ఒక్కటి. ఇది క్రీ.శ 1792 లో మహ్మద్ కులీకుతుబ్ షా నిర్మించారు. ఈయన అరబ్, ఊర్దు, పర్షియన్, తెలుగు బాషలలో పాండిత్యం కలవాడు. ఊర్దు,తెలుగు బాషల్లో కూడ కవితలు రాశాడు. ఇయన భాగ్ మతి అనే బంజారా స్త్రీని ప్రేమించి 1589 లో పెళ్లిచేసుకున్నాడు.పెళ్లైన తర్వాత బాగ్ మతి ఇస్లాం మతాన్ని స్వీకరించి హైదర్ మహల్ అని పేరు మార్చుకుంది. దానిని అనుసరించి హైదరాబాద్ గా మారింది. కులీకుతుబ్ షా 1611 లో చనిపోయాడు. అదే సంవత్సరంలోనే బాగ్ మతి కూడ చనిపోయింది.తర్వాత గొల్కొండ కోటను సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా తో పాటుగా చివరిగా అబుల్ హసన్ కుతుబ్ షా కూడ పరిపాలించాడు. తానీషా కంటే చక్రవర్తిగా ఉన్న తానిషా మామ అబ్దుల్లా కుతుబ్ షాని డక్కన్ లో మొగల సేనానిగా ఉన్నఔరంగజేబు ఓడించి, మొగల్ చక్రవర్తి అయిన షాజహాన్ సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టె విధంగా అంగీకరించాడు. మొగలుల దండయాత్ర నుండి గొల్కొండను రక్షించడానికి మహారాష్ట్ర రాజైన శివాజీతో అబుల్ హసన్ సంది కుదుర్చుకున్నాడు. 1680 లో శివాజీ మరణం తర్వాత 1685 లో ఔరంగజేబు తన కుమారుడైన షా ఆరమ్ నాయకత్వంలో గొల్కొండపైన దండయాత్ర చేశాడు.మొదట గొల్కొండకే విజయం లభించినా కొంతమంది సేనానులు నమ్మక ద్రోహం వలన గొల్కొండ సైన్యాలు ఓడిపోయాయి. పర్యవసానంగా అబుల్ హసన్ సందిచేసుకున్నాడు. కొన్ని శాసనాలు క్రింద అబుల్ హసన్ కోటి పన్నులు చెల్లించాలి. సంవత్సరానికి రెండు లక్షల పన్నులు చెల్లించాలి. అక్కన్న, మాధన్నలను ఉద్యోగాలనుంచి తొలగించాలి. మొగల్ సైన్య వెళ్లిన తర్వాత అబుల్ హసన్ జాప్యం చేశాడు. ఔరంగజేబు కోపానికి వీరేనని బావించిన కొందరు. అంతపుర స్త్రీలతో అక్కన్న,మాదన్నల హత్యకు కుట్ర పన్నారు. 1686 మార్చి 24 న రాత్రి సుల్తానులతో సంప్రదించి ఇంటికి వెలుతున్న వారిని నడివీధిలో హత్యచేశారు.1683 లోఅబుల్ హసన్ కట్టవలసిన పన్నులు సకాలంలో చెల్లించలేదు. ఔరంగజేబు  1687 లో పిబ్రవరి 7 న దండయాత్ర చేశాడు. తానిషా గొల్కొండ కోట పై దాడిని 8 నెలలపాటు అడ్డుకున్నాడు. 1687 అక్టోబర్ 3 వ తేదిన ఔరంగజేబు లంచం ఇచ్చి గొల్కొండ కోట తలుపులు తెరిపించి గొల్కొండ కోటను తన వశం చేసుకున్నాడు. తానిషాని బందిగా తీసుకెళ్లి దౌలతాబాద్ కోటలో బందిగా 13 సంవత్సరాలు బందిస్తే అక్కడ తానిష మరణించాడు. దాంతో కుతుబ్ షా వర్గం అంతమోదింది. దక్కన్ లో మొగళులు ఆద్వర్యంలో నిజాం పాలన 1701 లో  ప్రారంభం అయ్యింది. అతి సుందరమైన పట్టనమే మన హైదరాబాద్.  ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినది. అందరికి షేర్ చెయ్యండి.

19 సెప్టెంబర్ 2016

అమ్మంటే

అమ్మంటే అవసరం,
అమ్మంటే ఆనందం,
అమ్మంటే అమృతం,
అమ్మంటే ధైర్యం,
అమ్మంటే ఆశీర్వాదం,
అమ్మంటే అపురూపం,
అమ్మంటే అద్వితీయం,
అమ్మ వుంటే అదృష్టం,

అమ్మ లేకుంటే......??? ప్రస్తుత నా పరిస్తితి అదే.....
మిత్రులారా, గత పదిహేను రోజులుగా మీతో కలవలేక పోయాను,
కారణం మా అమ్మగారు శివ సాయుధ్యం పొందారు,
కార్యక్రమాలన్నీ ముగిచుకుని మీ ముందుకు వచ్చాను. నమస్తే..
బోయనపల్లి రమణ

వంట గ్యాస్ గురించి ఇది మీకు తెలుసా ?

ఈ రోజుల్లో వంట గ్యాస్ లేని ఇల్లు ఉండదంటే ఎవరు నమ్మరు. ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఉంటుంది ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు మారుతున్నారు కాబట్టి, ప్రతి ఒక్కరు గ్యాస్ వినియోగం గురించి మాత్రమే తెలుస్తుంది. దాని వెనుక ఉన్న మరెన్నో విషయాల గురించి తెలుసుకుందాం.
ప్రతి వంట గ్యాస్ వినియోగదారులకు 40 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందట!. ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియని రహస్యం. సిలిండర్ పేలినా, బ్రతికి బయట పడ్డవారికి కూడా 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తప్పని సరి ఇవ్వాలట. ఏ ఒక్కరికైనా ఇచ్చిన దాఖాలాలు ఉన్నాయా? ఇలాంటి పాలసీ ఒకటి ఉందని కూడా గ్యాస్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు తెలియదట. ఇక సామాన్యులకేమి తెలుస్తుంది చెప్పండి? ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు కుమ్మక్కై ఇలాంటి ముఖ్య సమాచారాన్ని బయటకి రానివ్వడంలేదు. ఇప్పటి వరకు కొన్ని వందల గ్యాస్ సిలిండర్ పేలిన, ప్రాణాలు పోగొట్టున్నా, ఏ ఒక్కరికైనా ఈ పాలసీ ద్వారా డబ్బులు అందినా దాఖలాలు లేవు. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు గ్యాస్ ఏజెన్సీ దగ్గరకి వెళ్ళినప్పుడు ఈ ఇన్సూరెన్సీ గురించి తెలుసుకొండి వాళ్లకి తెలియకపోతే తెలియజేయండి  ప్రతి ఒక్కరికీ తెలియాలి. ప్రచారం జరగాలి....సాధ్యమైనంత మందికి షేర్ చెయండి ప్లీజ్.

14 సెప్టెంబర్ 2016

బండి కీ లాక్కునే అధికారం ఏ పోలీస్ కి లేదు - RTA

బైక్ లో వెలుతున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర లేదా చెకింగ్ పాయింట్స్ పోలీసులు బైక్ ఆపి కీ లాక్కోవడం మనకు జరిగుండవచ్చు లేదా మనం చాలా చోటల్లో చూస్తుంటాం, తర్వాత మన దగ్గర లైసెన్స్, పోల్యూషన్,ఇన్సూరేన్స్ లాంటి పత్రాలను అడిగి చూస్తారు. అన్ని ఉన్న ఏదో ఒక వంకతో కొందరు పైన్ వేస్తారనుకొండి కాని బైక్ కీ లాక్కునే అధికారం కానిస్టేబుల్ కే కాదు ఏ పోలీసు అధికారికి లేదని రవాణాశాఖ స్పష్టం చేసింది. హర్యానలోని సిర్పా ప్రాంతానికి చెందిన పవన్ పారిఖ్ అనే లాయర్ కీ ఒక కానిస్టేబుల్ లాక్కున్నాడు,  ఆ లాయర్ ఆర్.టి.ఎ ని ప్రశ్నించాడు.దానికి స్పందించిన రాష్ట్ర హోం శాఖ అలా కీ లాక్కునే అధికారం ఏ కానిస్టేబుల్ కే కాదు, ఏ పోలీసు అధికారికి లేదని తెలిపింది. పోలీసులకు ఆ విషయం తెలియకనే వారు అలా ప్రవర్తించి ఉంటారని తెలిపింది. పవన్ కూడ అనుభవించాడు కాబట్టే సూటిగా రవాణాశాఖ ను అడిగాడు.ఇలాంటివి చాలా మంది అనుభవించే ఉంటారు, అలాంటి సమయంలో మనకు చాలా కోపం వస్తుంది.అర్హతతో సంబందం లేకుండా ఎవరు పడితే వారు రశీదు బుక్ చేత పట్టి ఫైన్ లు వేస్తారుకొంత మంది పోలీసులు డబ్బులు అవసరమైతే అన్ని ఉన్న ఛలానాలు వసూలు చేస్తుంటారు ఇది మంచి ఆదాయం. పోలీసులు బైక్ మీద ముగ్గురు వెళోచ్చు,ట్రాఫిక్ సిగ్నెల్ తో సంబందంలేకుండా వెళోచ్చు, సమాన్య ప్రజలు వెలితే బండి ఆపి ఫైన్ వేస్తారు. రూల్స్ పాటించమని చెప్పె పోలీసులే రూల్స్ బ్రేక్ చేస్తే ఎలా? డ్రైవింగ్ చేసే ప్రతి మనిషి ట్రాఫిక్ రూల్స్ ని ఒక్కసారైనా బ్రేక్ చేస్తాడు.
హైదరాబాద్ లో వాహనదారులకు కొత్త నిబంధనలు
మార్చి 1 వ తేది నుండి లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. 1 వ సారి దొరికితే ఒక రోజు, 2 సారి దొరికితే రెండు రోజులు, 3 వ సారి దొరికితే ఏకంగా వారం రోజులు పాటు జైలు శిక్ష విధించనున్నారు. ఇది ఇలా ఉంటే బండిని ఎవరు నడిపినా కేసు మాత్రం బైక్ యజమానిపైనే నమోదు చేస్తారు. బైక్ నడిపే వారికి హెల్మెట్ తప్పని సరి, వెనుక కూర్చున్నా వారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. కాని బెంగుళూరు లాంటి మరి కొన్ని రాష్ట్రలలో నడిపేవారికి వెనుక కూర్చున్న వారికి హెల్మెట్ తప్పని సరని అంటున్నారు.
పాదచారులు పాటించాల్సినవి.
సిగ్నెల్ పడినప్పుడు వాహనదారులకు అడ్డంగా నడవకూడదు.
ఫుట్ పాత్ మీదనే నడవాలి.
ట్రాఫిక్ సిగ్నెల్స్ ని పాదచారులు కూడ పాటించాలి.

డ్రైవింగ్ చేసే ప్రతివాళ్ళు తెలుసుకోవాల్సినవి.
1. ట్రాఫిక్ సిగ్నెల్స్ పాటించడం.
2. డ్రైవింగ్ లైసెన్స్ కలిగిఉండటం.
3. వాహనానికి సంబందించి రిజిస్ట్రేషన్,పోల్యూషన్,ఇన్సూరేన్స్ తప్పకుండా ఉండాలి.
4. బండిని ఆపి కీ లాక్కునే అధికారం ఏ పోలీస్ అధికారికీ లేదని.
5. ఏ పోలీస్ అధికారికి ఫైన్ ను బై హ్యాండ్ గా చెల్లించాల్సిన అవసరం లేదు.
6. లైసెన్స్ లేని పరిస్థితిలో లైసెన్స్ నెంబర్ చెప్పినా చాలు
7. ఎస్.ఐ పై స్థాయి వ్యక్తులు తప్ప ఇతర అధికారులు చలానా వేయడానికి అర్హులు కారు.
8. అన్నిటి కన్నా ముఖ్యంగా హెల్మెట్ తప్పని సరిగా ఉండాలి.
9. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్

అందరు తెలుసుకోవాల్సినవి. దేనికి ఎంత చలానా?
సెక్షన్                                        నేరం                టూ వీలర్        త్రీవీలర్     4 వీలర్
129/177                         హెల్మెట్ లేకపోవటం            100                 -            -
128/177                            త్రిఫుల్ రైడింగ్                250                -            -
183/177                                 అధిక వేగం               400               400          400
181(2)177                    డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటం        500              500          500
184(ఏ)177                     ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్       1000            1000        1000
ఆర్.436                         ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్           1000            1000        1000
ఆర్.36                             ఓవర్ లోడ్ పాసింజర్స్        1000            1000        1000
196/177                         ఇన్సూరెన్స్ లేకపోవటం          1000            1000        1000
190(2)177                         పొల్యూషన్ సర్టిఫికెట్        1000            1000        1000
184/177                         ప్రమాదకరంగా నడపటం       1000             1000     1000
192(1)177                         పర్మిట్ లేకపోవటం          2000            2000        2000

పోలీసు అధికారులు ప్రజలతో కలసి ట్రాఫిక్ రూల్స్ గురించి వారికి వివరించి పాటించేలా చెయాల్సిన పని వారికి ఉంది. అంతే కాని డబ్బులు వసూల్ చేస్తే ప్రజలను ఇబ్బందికి గురిచెయకండి, పోలీసులపై మంచి గౌరవం ఉండేలా ప్రజలతో నడుచుకొండి ప్లీజ్..
ఈ న్యూస్ మీకు నచ్చినట్లేతే అందరికి షేర్ చెయండి ప్లీజ్...

01 సెప్టెంబర్ 2016

ఉత్తమ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి?

ఉత్తమ ఉపాధ్యాయుడు అని పించుకోవాలంటే పాటించాల్సినవి..

  1. సమయ పాలన పాటించాలి.
  2. భోధనా సమయం సద్వినియోగం చేసుకోవాలి.
  3. సామాజిక బాధ్యతతో సేవా భావాన్ని కలిగిఉండాలి.
  4. నిరంతరం అధ్యయనం చేస్తు నూతనంగా బోదించాలి.
  5. విధ్యార్థికి స్నేహితునిగా, మార్గదర్శిగా ఉండాలి.
  6. శాస్త్రీయ వైఖరులు కలిగి మార్పును స్వాగతించాలి.
  7. దేశభక్తిని,నైతిక విలువలను పెంపొందించాలి.
  8. నీతి, నిజాయితి వైపు నిలబడాలి.
  9. విషయావగాహణతో మాట్లాడాలి.
  10. ఉచ్ఛారణతో స్వష్టత కలిగి ఉండాలి.
  11. తరగతి గదిలో సెల్ ఫోన్ ఉపయోగించకూడదు.
  12. విద్యార్థిని, విద్యార్థునులపైన ఎటువంటి కక్ష సాధించకూడదు.
  13. ముఖ్యంగా విద్యార్థినిలపైన లైంగిక,మానసిక వేదింపులు చెయకూడదు.
  14. క్రమశిక్షణ నియమాలు పాటించాలి. ఇలా ఉన్న ఏ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలైనా ఉత్తమ ఉపాధ్యాయులంటారు. గురుదేవోభవ...........

31 ఆగస్టు 2016

జంతువుల నుండి నేర్చుకోవాల్సినవి

జంతువుల నుండి నేర్చుకోవాల్సినవి
  1. లేవడంలో కోడిని చూసి నేర్చుకోవాలి.
  2. పరుగులో గుర్రాన్ని చూసి నేర్చుకోవాలి.
  3. వినడంలో పిల్లని చూసి నేర్చుకోవాలి.
  4. విశ్వాసంలో కుక్కని చూసి నేర్చుకోవాలి.
  5. సేవలో ఎద్దుని చూసి నేర్చుకోవాలి.
  6. గానములో కోకిలని చూసి నేర్చుకోవాలి.
  7. నాట్యంలో నెమలిని చూసి నేర్చుకోవాలి.
  8. విజ్ఞానానికి హంసని చూసి నేర్చుకోవాలి.
  9. పౌరుషంలో పొట్టేలుని చూసి నేర్చుకోవాలి.
  10. సాహసంలో పులిని చూసి నేర్చుకోవాలి.
  11. పరాక్రమంలో సింహన్ని చూసి నేర్చుకోవాలి.
  12. నిశిత దృష్ఠిలో చీమని చూసి నేర్చుకోవాలి.  
    ఇలా జంతువులని చూసి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.

28 ఆగస్టు 2016

పురుష జీవితం


  • పురుషులంటే సమాజంలో ఎంత చిన్న చూపు!
  • ఒక పేపర్లో వ్యాసం లేదు,ఒక టీవిలో ప్యాకేజీ లేదు, పురుషులంటే మరీ ఇంత వివక్షా...
  • మగవాడు దేవుని సృష్ఠిలో ఒక అద్భతం.
  • తన చాక్లెట్స్ చెల్లెకు ఇవ్వగలవాడు....
  • తన కలలను తల్లిదండ్రుల చిరునవ్వుకోసం త్యాగం చెేయగలవాడు...
  • తన పాకెట్ మనీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్టలకోసం ఖర్చుపెట్టగలవాడు....
  • తన యవ్వనకాలమంతా త్యాగంచేసి భార్య పిల్లలకోసం గొడ్డులా పనిచేసి కంప్లైంట్ చెయ్యనివాడు...
  • వారి భవిషత్తుకోసం బ్యాంకులలో అప్పుులుచేసి జీవితమంతా తిరిగి కట్టేవాడు...
  • అనేక కష్టాలు పడి అమ్మనాన్నలు, భార్య, బాసులతో తిట్లు తింటూ వాళ్ల ఆనందం కోసం జీవించేవాడు....
  • బయటకు వెళ్తే ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు....
  • ఇంట్లో ఉంటే బద్దకిస్టీ బయటకు కాలు పెడ్డడంటారు....
  • పిల్లలను తిడితే కర్కోటకుడు అంటారు, పిల్లలను తిట్టకపోతే భాద్యతలేదంటారు....
  • భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్లాం సంపాదన మీద బతుకుతున్నాడంటారు...
  • భార్య చేత ఉద్యోగం చేయించకపోతే ఇన్ఫిరియారిటీ అంటారు....
  • అమ్మ మాట వింటే అమ్మకూచి అంటారు....
  • భార్య మాట వింటే బానిస బ్రతుకు అంటారు....
  • ఆడపిల్లలు మగవాడిని గౌరవించండి....
  • వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం చూడండి......
  • మగవాళ్ళు ఇది అందరికి పంపించండి....!
  • మన మీద మనమే సానుభూతి చూపించకపోతే ఎలా....?
  • మై డియర్ మహిళలు ప్లీజ్ మగవారిని బాధపెట్టకండి.

భార్య ఎంత సేవ చేస్తుందో మీకు తెలుసా?


భార్య ఎంత సేవ చేస్తుందో మీకు తెలుసా?
  • ఎక్కడో పుట్టి పెరిగి, మిమల్ని నమ్మి మీ వెంట వస్తుంది.
  • మీ వంశాన్ని నిలబెడుతుంది.
  • సంసారాన్ని నిత్యం సాగు చేసి పంట తెచ్చి పెడుతుంది.
  • రాత్రి సుఖాలను ఇస్తుంది.
  • గృహాన్ని సైనికుడిలా కాపాడుతుంది.
  • భర్త కీర్తి ప్రతిష్ఠలను పెంచేలా ప్రవర్తిస్తుంది.
  • భర్తకు భార్యగా, అత్త మామలకు కొడలిగా, పిల్లలకు తల్లిగా సేవలు చేస్తుంది.
  • భర్త భార్యను మరో తల్లిగా బావిస్తే, భార్య భర్తను మొదటి బిడ్డలా బావిస్తుంది.
  • సతీ సావిత్రి, సతీ అనసూయ లాంటి వారేందరో భర్తకు సేవలు చేశారు చరిత్రలో నిలిచారు.
  • ఆఖరికి వృద్దాప్యంలో కూడా చేతనయినంత సేవ చేస్తుంది.
  • భార్య నుంచి అన్నీ పొందాడు కాబట్టే శివుడు మొదటి భార్యకు అర్థశరీరాన్నీ, రెండవ భార్యను తలపైన పెట్టుకున్నాడు.
  • మహావిష్ణువు లక్ష్మీదేవిని వక్షఃస్థలమందు, బ్రహ్మ సరస్వతిని ముఖమునందు స్థానమిచ్చి వారి ప్రేమను తెలియజేశారు. మరీ మీరు మీ భార్య పైన ప్రేమను ఎలా చూపిస్తారో.............

కోడితో జాగ్రత్త


కోడెేకదా కోస్తే చికెన్ అవుతుంది తినేద్దాం అనుకుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మనం చికెన్ తినేటప్పుడు కోడి రెక్క, మెడ భాగాన్ని తినకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా స్త్రీలు తినకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ?
  1. కోళ్ళు త్వరగా పెరగడానికి రెక్క ,మెడ భాగంలో స్టిరాయిడ్ లు ఇంజెక్షన్ లు వేస్తారు. అది వేసిన చోట ఇంజేక్షన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
  2. మహిళల్లోని హార్మోన్లు ఈ స్టీరాయిడ్ లు త్వరగా ప్రభావితమై గర్భాశయంలో గడ్డలు ఏర్పడేలా చేస్తాయి. అవి కాన్సర్ గా మారే ప్రమాదం కూడా ఉంది.
  3. ఇటివల వైద్య పరిశోధనల్లో తెలిసింది. ఈ విషయాన్ని అందరికి తెలియజేసి విలువైన ప్రాణాలను కాపాడండి.