17 డిసెంబర్ 2025

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హఫీజ్ పేట్, సాయినగర్ లో అంగన్వాడీ భవనాలు. ప్రహరీ గోడ నిర్మించాలని

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ భవనాలు. ప్రహరీ గోడలను నిర్మించాలని  హాఫిజ్ పేట్ బీజేపీ అధ్యక్షులు కైతాపురం జితేందర్ డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్, సాయి నగర్ బస్తీ లోనీ అంగన్వాడీ కేంద్రంను సందర్శించి వివిధ సమస్యల వివరాలను  సేకరించడం జరిగిందని ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలకు ప్రహరీ గోడలు లేక ఇబ్బందులకు నిలయంగా మారాయని సంబంధిత అధికారులు వెంటనే నిర్మించాలని ఆయన కోరారు.
సాయినగర్ బస్తీలో అంగన్వాడీ కేంద్రంను కిర్బీ షీట్లతో రూమ్ ఏర్పాటు చేసి వదిలేశారని, విద్యుత్ వసతి లేక ఎండ వేడికి చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నారు,వాష్ రూమ్ లేవని , అంగన్వాడీ కేంద్రం ముందర మస్కా కుంట చెరువు ఉండడంతో, ప్రహరీ గోడ లేక పోవడం ప్రమాదకరంగా ఉన్నదన్నారు, మస్కా కుంట చెరువు మొత్తం చెత్త ,బురదతో ఆ ప్రాంతం దుర్వాసనతో ఉన్నదని, చెరువు వద్ద పరిశుభ్రత పాటించకపోవడం.అక్కడ కనీస వసతులు లేక చాలా ఇబ్బందిగా ఉంటున్నారన్నారు, 
అయ్యప్ప పాట వింటే సర్వశుభాలు కలుగుతాయి!
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , బీజేపీ జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్ , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, డివిజన్ బీజేపీ కార్యదర్శి సుబ్బారావు ,డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్.డివిజన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బాలరాజు , బీజేపీ నాయకులు శ్రీకాంత్ , కార్తీక్ , లోకేష్ , నిఖిల్ , నాగరాజు.స్థానిక బస్తీ వాసులు , మహిళలు పాల్గొన్నారు.

Raju Reporter
RR District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

14 డిసెంబర్ 2025

తెలంగాణ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం...

ఏ జిల్లా నుండి పేపర్ రిజిస్ట్రేషన్ అయితే అక్కడి వరకే అక్కడేషన్స్ సౌకర్యం...
ఆందోళనలో సంపాదకులు.. అక్రిడేషన్ సౌకర్యం రద్దయ్య... అవకాశం...
 తెలంగాణ పత్రికా సంపాదకులకు  గత 20 సంవత్సరాల నుండి  తీవ్ర అన్యాయం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.బి. రాజు డిమాండ్ చేశారు. 2002లో అప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయంలో జర్నలిస్టులకు బస్సు పాసులు. హెల్త్ కార్డులు మంజూరు చేసింది. ప్రస్తుత ప్రభుత్వాలు మాత్రం పత్రిక సంపాదకుల పైన కరుడుగట్టిన నేరస్తులను చూసినట్లుగా ప్రభుత్వాలు.  అవగాహనలేని ప్రెస్ అకాడమీ చైర్మన్లు. నిర్లక్ష్యపు దూరనిలో నిర్లక్ష్యపు ధోరణిలో  నడుస్తున్నాయని ఆరోపించారు. ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసాలలో కొత్త కార్డులు ఇవ్వకుండా పాత కార్డులను మార్పిడి చేసుకుంటూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వం  కనీసం పత్రిక ఎడిటర్లకు. కెమెరామెన్ లకు న్యూస్ సేకరణ కోసం జిల్లా రాష్ట్ర పాసులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంత ప్రభుత్వానికి కాకపోతే నియోజకవర్గస్థాయి జర్నలిస్టులకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. నిమ్మకు నీరెత్తినట్లుగా కెసిఆర్. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికలపై చిన్న చూపు చూడడం వల్ల ఎన్నికలలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ప్రభుత్వాలు గమనించడం లేదని కే.బి.రాజు స్పష్టం చేశారు. 
మహబూబ్నగర్ జిల్లాలో చాలామంది పాత్రికేయులు అక్రిడేషన్ సౌకర్యం లేక రోడ్డున పడ్డ సంబంధిత కలెక్టర్ డి పి ఆర్ ఓ లు నేటి వరకు పట్టించుకున్న పాపంసంబంధిత కలెక్టర్ డి పి ఆర్ ఓ లు నేటి వరకు పట్టించుకున్న పాపనపోలేదని సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొన్ని పత్రిక యాజమాన్యాలు అక్రిడేషన్ కార్డులను పదివేల నుండి 20వేల వరకు అంతర్గతంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి ధోరణి వల్ల విలేకరి చేసేది ఒక పత్రిక అక్రిడేషన్ కార్డు మరొక దినపత్రికతో సంబంధాలు పెట్టుకుని నడిపిస్తున్నారు. ఇలాంటి వ్యవహారానికి చరమగీతం పాడవలసిన రోజులు ఆసన్నమయ్యాయని. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఇటీవల పత్రికలలో కొన్ని మార్పులు తెచ్చిన విధివిధానాలు ఈ విధంగా ఉన్నాయి. ఏ జిల్లాలో అయితే స్థానికేతరుడుగా ఉండి అక్కడి సంబంధిత ఆర్డిఓ దగ్గర నుండి ఆర్ఎన్ఐ చేయించుకున్న వారికి అక్కడి జిల్లా వరకే పరిమితం అవుతుందని. ఇతర జిల్లాలో అక్కడేషన్ ఆ పత్రిక చెల్లుబాటు కాదని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇలాంటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అక్కడ జిల్లాల నుండి అయినా అక్రిడేషన్ సౌకర్యము విలేకరులకు కల్పించాలని పత్రికా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది 

రంగారెడ్డి. (కే.బి.రాజు)

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

06 డిసెంబర్ 2025

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇదీ పరిస్థితి!

ఇండిగో విమానాలు రద్దవడంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లలో దారుణ పరిస్థితులు
వరుసగా నాలుగో రోజు ఇండిగో విమానాలు రద్దు
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటికే రద్దైన 69 ఇండిగో విమానాలు.
దీంతో ప్రయాణికులతో, సూట్‌కేసుల కుప్పలతో రైల్వే స్టేషన్‌లా దారుణంగా మారిన హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ, చెన్నై సహా పలు ఎయిర్‌పోర్ట్‌లు.

Raju Sr Reporter
RR District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

04 డిసెంబర్ 2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై బిజెపి ఆధ్వర్యంలో నిరసన... బిజెపి సీనియర్ నేత రవికుమార్ యాదవ్ పిలుపు...

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిగా అమలు చేయలేదని నేటి వరకు పెండింగ్లోనే ఉన్నాయని  శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి కాంటెస్ట్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందుబాటులో లేవని వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని గురువారం ఆయన స్వగృహంలో  నిర్వహించిన జిల్లా.జిల్లా నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులతో సంయుక్తంగా  ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ నాయకులతో మాట్లాడుతూ ఈనెల ఏడవ తేదీన ఇందిరా పార్కులో  భారీ ఎత్తున బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరుగుతుందని పిలుపునిచ్చారు. అనంతరం రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా  అధ్యక్షురాలు కొత్తపల్లి పద్మ మాట్లాడుతూ  బిజెపి నేతలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ దేవుళ్ళ పైన  వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆమె  వ్యాఖ్యానించారు. వాటిని వెంటనే వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మేరీ సలోమాన్. సరోజా రెడ్డి. స్వగృహ విజయలక్ష్మి. 106 డివిజన్ మహిళా మోర్ఛ ప్రధాన కార్యదర్శి ఆదిలక్ష్మి. ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి. ప్రధాన కార్యదర్శి స్వప్న. రాణి లతోపాటు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టాలని   బిజెపి ఆధ్వర్యంలో నిరసన... బిజెపి సీనియర్ నేత రవికుమార్ యాదవ్ పిలుపు...

Raju Sr Reproter
RR District 
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

02 డిసెంబర్ 2025

గోపీ చెరువుకు దారేది...? జిహెచ్ఎంసి అధికారులు చర్య తీసుకోండి...!

నుమరుగవుతున్న గోపీ చెరువునాలా...
కట్టపై రాళ్లు వేసి అక్రమనకు గురి... చెరువుకు దారేది...?
జిహెచ్ఎంసి అధికారులు చర్య తీసుకోండి...!

గోపి చెరువులోకి రాజీవ్ గృహకల్ప నుండి మురికి నీరు వెళ్లే విశాలమైన నాలాపైన రాళ్లు వేసి కబ్జాకు గురిచేశారు. గోపి చెరువుగోపి చెరువుకు వెళ్లడానికి దారులు లేకుండా పెద్దపెద్ద బండ రాళ్లు చెత్త చెదారంతో నింపి వేయడంతో  ప్రభుత్వ స్థలాన్ని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కబ్జా చేయడానికి కట్టుదిట్టమైన ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు పాపి రెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్పలో జరగడం సర్వసాధారణంగా మారింది. ఇక్కడ ప్రజలను రక్షించే పాలకులే భూములను భక్షించే డేగాలుగా మారిపోయారు.

చెరువులలోకి కూడా వెళ్లకుండా చెరువుల దారులను మూసివేసి కబ్జాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంఘటన శేరిలింగంపల్లి 106 డివిజన్లో జరిగింది. ఇలాంటి సంఘటనలో ఇక్కడ ఉన్నవారికి అలవాటు పడింది. ఇలాంటి సంఘటనలు ఎవరి ద్వారా వస్తున్నాయి. ఎందుకు జరుగుతుంది. అనే సమస్యలను జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి వెళ్లకుండా ఎక్కడికక్కడే ఇలాంటి అస్తవ్యస్తమైన పనులకు కొంతమంది శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఇలాంటి సమస్యల పైన జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ చర్యలు తీసుకొని గోపీ చెరువులోకి ప్రజలు వెళ్లడానికి నాలా పైన వేసిన రాళ్లను మురికి చెత్తను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఎవ్వరికి దొరికినంత వారు దోచుకోవడమే ఈ కాలనీలో జరుగుతున్న పరిస్థితులు జిహెచ్ఎంసి. ఎమ్మార్వో. నేటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు, కండ్లకు కనిపిస్తున్న వైనాలు కూడా స్థానిక కార్పొరేటర్కు కనిపించినా నాకెందుకులే అన్న చందంగా వ్యవహరించడంతో ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. ఇక్కడ నాలాకు ఒక అప్డేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని నాలాను విశాలంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Raju Sr Reporter.
RR District.
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

26 నవంబర్ 2025

గుల్మోహర్ పార్క్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోని సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన మీడియాను అడ్డుకున్న లక్ష్మీనరసింహ.

గుల్మహార్ పార్క్ కమిటీని రద్దు చేయాలని మీడియా డిమాండ్ చేసింది. రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కే.బి. రాజు  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో జరుగుతున్న అవకతవకలపై అర్హులైన లబ్ధిదారులను  మీడియా ప్రశ్నించడానికి వెళితే  నన్ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గుల్మోహన్ పార్క్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నాడని నాతో పాటు మరో 15 మంది ఉన్నారని మీడియా రిపోర్టర్ పై వాగ్వివాదానికి దిగాడు. ఆయన ఎలాంటి వేతనాలు తీసుకోకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సేవ చేస్తున్నానని నాకు మరో 14 మంది వెంబడి ఉన్నారని వాళ్లందర్నీ పిలిపిచ్చి మిమ్మల్ని వెళ్లగొడతారని బెదిరింపులకు గురిచేశాడు. ఈయన వాలకం చూస్తుంటే  ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో పక్క అవినీతి జరిగిందని స్పష్టంగా చెప్పవచ్చు. అప్పటి కెసిఆర్ ప్రభుత్వము కొంతమందికి ఇండ్లు కేటాయించింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి.  హౌసింగ్ బోర్డ్ అధికారులు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్. నేటి వరకు పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేయలేదు. వృధాగా పట్టా సర్టిఫికెట్లు లేకుండా హౌసింగ్ బోర్డ్ అధికారుల చేత మ్యామ్యాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కబ్జా అయినట్లు విశ్వాసం  సమాచారం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో  సెక్యూరిటీ గార్డులకు తగిన వేతనాలు లేక సతమతమవుతున్నారు. గుల్మోహన్ పార్కులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఇప్పటికీ  జనరేటర్ రెండు ఉన్నాయని. దాని పవర్ సరిపోకపోవడంతో  లిఫ్టులు పనిచేయడం లేదని అందులో ఉండే వ్యక్తి తెలిపాడు. లబ్ధిదారులు లబ్ధిదారులు దిగిపోవడాని లిఫ్టులు పనిచేయడం లేదని అందులో పనిచేసే సిబ్బంది తెలిపాడు. ఎండాకాలంలో లబ్ధిదారులకు నీటి కొరత ఏర్పడుతుందని కమిటీ సభ్యుడు కోరాడు. వీళ్లను కూడా లెక్క చేయకుండా లక్ష్మీనరసింహ  అనే వ్యక్తి తప్పుడు సమాధానాలు చెప్పడంతో డబుల్ బెడ్ రూమ్ లో ఉన్న సమస్యలను చెప్పలేక మీడియాను తప్పుదోవ పట్టించాడు. ఇలాంటి తప్పుడు మాటలు ఎందుకు చెబుతున్నావ్ అని అడిగితే  నేను అన్ని మీడియాలకు తెలుసని బుస కొడుతున్నాడు. అనేక సమస్యలతో ఉండి కూడా  అక్కడ ఇండ్లు పూర్తిగా నిండిపోవడంతో అసలు ఇలాంటి వారిని ఎవరు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చర్యలు తీసుకొని  కమిటీని రద్దు చేసి  మీడియాను బయటికి వెళ్లాడా వెళ్లగొట్టడానికి ప్రయత్నించిన లక్ష్మీ నరసింహను వెంటనే తొలగించాలని లేనిపక్షంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేస్తామని మీడియా డిమాండ్ చేసింది.

Raju Sr Reproter

RR District

19 నవంబర్ 2025

గోపి చెరువు నాలా కబ్జా.! కట్టను కబ్జా చేసిన రాజకీయ నేతల దోస్తులు.!

గోపి చెరువు నాలా కబ్జా.! కట్టను కబ్జా చేసిన రాజకీయ నేతల దోస్తులు.!
కండ్లు మూసుకున్న కార్పొరేటర్...
 హైడ్రా కమిషనర్ పర్యవేక్షణ లోపం...
కబ్జాలను తొలగిస్తారా... ప్రజలనే తొలగించ మంటరా...
 చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కన్నుమూసి కన్ను తెరిచే లోపే కబ్జాలకు గురి చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు, కార్పోరేటర్లు, ఎమ్మెల్యేల పర్యవేక్షణ లోపం కారణంగా గోపీ చెరువు ఎక్కడికక్కడే కనుమరుగవుతుంది. 2017 నుండి ఈ చెరువును ఒక ప్రక్క ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం. మరోపక్క పాపి రెడ్డి కాలనీ ప్రజలు. మరోపక్క రాజకీయ నాయకుల అండదండలతో  గోపి చెరువు కనుమరుగవుతున్న నేటి వరకు స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తూతూ మంత్రంగా పరిపాలన వ్యవస్థ నడుస్తుంది తప్ప. ఇక్కడ ఎంత అవినీతి జరిగినా నేటి వరకు పట్టించుకున్న పాపాన్న పోలేదని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు, ఎక్కడ చూసినా అవినీతికి నిలయంగా శేరిలింగంపల్లి 106 డివిజన్  రాజీవ్ గృహకల్ప, పాపి రెడ్డి కాలనీ, గోపి నగర్ ప్రజలు ప్రభుత్వ భూములను నాలాలను దర్జాగా గోపి చెరువులో మట్టి పోసి దాంట్లోనే ఇండ్ల నిర్మాణం చేపట్టిన అవగాహన లేని కార్పోరేటర్ నిర్లక్ష్యం వల్లనే చెరువు పరిస్థితి రెంటికి చెడిన రేవడిల తయారయిందని ప్రజలు ముక్కు మీద  వేలేసుకుంటున్నారు. రాజీవ్ గృహకల్పలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగిన అగ్నిమాపక వాహనం కూడా రాకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ప్రజలు ఎక్కుబిక్కు నా అల్లాడిపోయే పరిస్థితులు బిక్కుబిక్కునా అల్లాడిపోయే పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి పరిస్థితులలో వర్షాలు బాగా పడడంతో గోపీచంద్వర్షాలు బాగా పడడంతో గోపీ చెరువు నిండుకుండలా తలపించి లింగంపల్లి అండర్పాస్ రైల్వే బ్రిడ్జిలో నీరు నిండిపోయి ప్రతిసారి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న అవగాహన లేని కార్పొరేటర్ జిహెచ్ఎంసి సిబ్బంది జోనల్ కమిషనర్. ఎమ్మెల్యే తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో ఇక్కడి ప్రజలు  ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని  గోపీ చెరువులోకి వచ్చే నీటి పైన ఉన్న నాళాలపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ నిర్మాణాలను శేరిలింగంపల్లి ఎమ్మార్వో. జోనల్ కమిషనర్ స్పందించి రోడ్లకు ఇరువైపులా ఉన్న డబ్బాలతో పాటు  గోపి చెరువు నాలాల పైన కట్టిన బిల్డింగులను కూల్చివేసి  గోపి చెరువును ఆదుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఇండ్ల ముందు నిరాహార దీక్షలు చేపడతామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అడ్డగోలు నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోని ఎమ్మెల్యే. కార్పొరేటర్లు ఏం చేస్తున్నారో ముఖ్యమంత్రి ప్రశ్నించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Raju Sr Reporter
RR District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

14 నవంబర్ 2025

బిజెపి కాంగ్రెస్. బి. ఆర్. ఎస్ ల గెలుపు వివరాలు. జూబ్లీహిల్స్ నుండి లైవ్....

 జూబ్లీహిల్స్  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాత్రి పగలు లెక్కచేయకుండా ముమ్మరంగా ప్రచారం చేపట్టడం ఆయన విజయానికి గెలుపుకు సోపానాలు.  టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలే మాగంటి సునీత ఓటమికి కారణాలుగా అన్ని పార్టీల వివరాలను విశ్లేషిస్తే  ఓటర్లు ఎక్కడ డబ్బులు తీసుకున్న గాని ఓటు మాత్రం నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించారు. ఇప్పటికే నవీన్ యాదవ్ కు 19 ఇప్పటికే నవీన్ యాదవ్ కు 19619 ఓట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. 19,619 వేల ఓట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కేటీ రామరావు విపరీతంగా ఆరోపణలు చేయడమే ప్రజల అదృష్టలో పడింది. మాగంటి సునీత గెలిచినప్పటికిని కేటీఆర్ ఇవే వరల్డ్ మాటలు మమ్మల్ని కూడా తిడతాడని ప్రజలు ఈ బుద్ధి చెప్పారని తెలుస్తోంది. మరి నువ్వే వివరాలు కాసేపట్లో తెలుసుకుందాం. ఇప్పటికే ఒక రౌండ్ కు ఆదిక్యం ముందుకు సాగుతా ఉంది. నవీన్ యాదవ్ గెలుపుతో సంబరాలు జరుపుకుంటున్నారు కార్యకర్తలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి. అన్ని వివరాలతో మీ ముందుకు తీసుకువస్తున్నారు

Raju Reporter
RR District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

11 నవంబర్ 2025

జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి..

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు జై మా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే అభ్యర్థి ముందంజలో ఉన్నాడని డిమా వ్యక్తం చేస్తున్నారు.
Raju Sr Reporter
Ragan Reddy District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

అపరిశుభ్రతకు నిలయంగా మార్చిన రాజీవ్ గృహకల్ప ఇంటి యజమానులు...

 రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 106 డివిజన్లో ని రాజువ్ గృహకల్పలో ఇండ్ల ముందే చెత్త కుప్పలు. పురుగులు పడ్డ నీరు కొన్ని నెలల నుండి డబ్బాలలో నిలువ ఉంచడంతో దోమల వాలిపోయాయని గుర్తించిన శాంటామాలాజీ  సిబ్బందిని జిహెచ్ఎంసి అధికారిని తేజస్విని వారంలో రెండుసార్లు దోమల నివారణ కోసం స్ప్రే చేయడానికి సిబ్బందిని పంపించి కాలనీవాసలో అపరిశుభ్రంగా ఉండకూడదని తగిన సూచనలు ఇచ్చి నీటిని నిలవ ఉంచకూడదని అవగాహన కల్పించారు.

Raju Sr Reporter
Ranga Reddy District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

08 నవంబర్ 2025

చందానగర్ మెయిన్ రోడ్డులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు...


మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

SR Reporter Raju
RR Dist Incharge

జూబ్లీహిల్స్ లో బీజేపీ జోరుగా ప్రచారం

జూబ్లీహిల్స్ లో బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదిపారంతో ప్రచారం ముగిస్తుంది కాబట్టి. ఈరోజు ప్రచారాన్ని వేగం వంతంగా చెయ్యడం లేదు.

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

04 నవంబర్ 2025

జూబ్లీహిల్స్ బిజెపి నియోజకవర్గ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేసిన శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్...


 జూబ్లీహిల్స్ నియోజకవర్గం దీపక్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే  మారబోయిన రవికుమార్ యాదవ్ ముమ్మరంగా ప్రచారం ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఆయన వెంబడి శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా మోర్చా కన్వీనర్ కొత్తపల్లి పద్మ. మేరీ సాలో మూన్. రాఘవేంద్రరావు.షేక్ పేట డివిజన్ అధ్యక్షులు రాకేష్. మంగళవారం ఉదయం బిజేఆర్ కాలనీ. అంబెడ్కర్ నగర్ కాలనీ. లక్ష్మీ నగర్ కాలనీలలో డబ్బులతో కాలనీలలో ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో ఇంటింటా తిరిగి బిజెపి అభ్యర్థి స్టిక్కర్లను అతికించారు. అనంతరం మారబోయిన రవికుమార్ యాదవ్ కాలనీలోని ప్రజలకు బిజెపి పార్టీకి ఓటు వేయాలని కోరారు.
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews  #telugufocustv #telugufocustvnews
RAJU - Sr Reporter - RR Dist

31 అక్టోబర్ 2025

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసులు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను సన్మానించారు.

మాదాపూర్‌లోని టి-హబ్ గేట్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సైబరాబాద్ పోలీసులు “ఏక్తా దివాస్ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఫిట్‌నెస్,సామరస్యం. సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి మనం కలిసి రండి” అనే థీమ్‌తో 2 కిలోమీటర్ల “రన్ ఫర్ యూనిటీ” నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని. రితిరాజ్, ఐపీస్, డీసీపీ మాదాపూర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ ఎడిసిపి ఉదయ్ రెడ్డి, ఎసిపి సిహెచ్. శ్రీధర్, మియాపూర్ ఏసీపీ సీహెచ్. వై. శ్రీనివాస్ కుమార్, మాదాపూర్ జోన్ ఇన్స్పెక్టర్లు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

150 వ జయంతి సందర్భంగా పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు... బిజెపి నేత కొత్తపల్లి పద్మ.

 భారత మాజీ ఉప ప్రధాని  ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను శుక్రవారం ఫతే మైదాన్ బషీర్బాగ్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి పరువు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రంగారెడ్డి జిల్లా నాయకురాలు కొత్తపల్లి పద్మ మాట్లాడుతూ భారతదేశానికి మాజీ ఉప ప్రధాని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. వేలాది మంది మహిళా కార్యకర్తలు  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో అన్ని కులాల వారికి న్యాయం జరిగే చట్టాలను అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు, ఉమ్మడి రాష్ట్రాలను సైతం లెక్కచేయకుండా అభివృద్ధి తన లక్ష్యంగా భావించారు.
జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీలలో ప్రచారాన్ని వేగవంతం చేశారు, కాంగ్రెస్ టిఆర్ఎస్ కంటే భారతీయ జనతా పార్టీ ప్రచారంలో నిమగ్నమయ్యారు, కిరాణా షాపులు, ఇండ్లలోకి వెళ్లి  మహిళలకు పూసగుచ్చినట్లు  కమలం గుర్తుకు ఓటు వేయాలని, అలాంటి సమయంలో  బిజెపి మనకు అహర్నిశల అందుబాటులో ఉంటుందని కొత్తపల్లి పద్మ తెలిపారు, ఏ ఇంటికి ప్రచారానికి వెళ్లిన మహిళలకు పూసగుచ్చినట్లు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను  ఓటర్లకు గుర్తుండేలా చెబుతున్నారు,


మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

29 అక్టోబర్ 2025

జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం... బిజెపి సీనియర్ నాయకురాలు కొత్తపల్లి పద్మ..

జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం... బిజెపి సీనియర్ నాయకురాలు కొత్తపల్లి పద్మ..


జూబ్లీహిల్స్ ఎన్నికలలో భాగంగా బిజెపి అభ్యర్థి లంకల దీపక్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని బిజెపి సీనియర్ నాయకురాల్లో కొత్తపల్లి పద్మ తెలిపారు. రాజేంద్రనగర్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజెపి అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాడని భీమా వ్యక్తం చేశారు. ఎండ వానను సైతం లెక్కచేయకుండా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

27 అక్టోబర్ 2025

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది,

సీఎం రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో  హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఈ అభివృద్ధిని కొనసాగించేలా  కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఆదివారం మధురానగర్ డివిజన్లో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు.ఆయనతోపాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు స్థానిక నాయకులు  పాల్గొన్నారు.ఈ సందర్భంగా రమేష్  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ అండగా ఉంటుందని వారి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.జూబ్లీహిల్స్  ఉప ఎన్నిక లో కార్యకర్తలు నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

22 అక్టోబర్ 2025

సైబరాబాద్ పోలీస్, ఎస్సి ఎస్సి సైబరాబాద్ సీపీవోలో మెగా రక్తదాన శిబిరం...653 యూనిట్ల రక్తం సేకరణ.


పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా, రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తో కలిసి బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మెడికోవర్ హాస్పిటల్స్. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో “రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి” అనే నినాదంతో జరిగింది  ఈ కార్యక్రమంలో సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి, ఐపీఎస్‌., రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. మేడ్చల్ డీసీపీ ఎన్ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, ఐపీఎస్‌ తదితరులు రక్తదానం చేశారు.

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews


17 అక్టోబర్ 2025

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న బీసీ నేతలు శేరిలింగంపల్లి.


ఈనెల 18వ తేదీన  బీసీ నాయకులు  సంఘటితమై  బందుకు సహకరించాలని రంగారెడ్డి జిల్లా. శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు  రామచంద్రరామచంద్రర్ యాదవ్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం చందానగర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కోమీరి శెట్టి సాయిబాబా. రంగారెడ్డి జిల్లా సగర సంగం అధ్యక్షులు శేఖర సా రంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు శేఖర సగర. శేరిలింగంపల్లి 106 డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. బీసీ నాయకులు  సుప్రజా ప్రవీణ్. రామకృష్ణ. భక్తరాజు. లతోపాటు. అనంతరం బీసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ శనివారం నిర్వహించే బందుకు అన్ని సంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు.

Sr Reproter Raju
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

28 జనవరి 2025

ఫిబ్రవరి 3న ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్

 ఫిబ్రవరి 3న ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో టీం గేర్ పెంచేసింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన అసలు సిసలు అప్డేట్ రాబోతోంది. ఈ మేరకు చిత్రయూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఫిబ్రవరి 3న డార్లింగ్ ప్రభాస్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రభాస్‌ను అలా కొద్దిగా చూపించి ఊరించారు. ఈ పోస్టర్‌లోని త్రిశూలం, ప్రభాస్ చూపులు, నుదుట విబూదిని చూస్తుంటే ఈ లుక్ కన్పప్ప చిత్రానికే హైలెట్‌గా నిలిచేలా ఉంది. 


కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ఆడియెన్స్ ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇలా ఎంతో మంది భారీ తారాగణం నటించింది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి.

#telugunews #telugufocustv #telugufocustvnews #prabhas #kanappamovie #kannappamovieprabhaslook #prabhasnewmovie #prabhasfans #prabhaslook

27 జనవరి 2025

బ్రహ్మ ఆనందం’ నుంచి సెకండ్ సింగిల్ ‘విలేజ్ సాంగ్’ విడుదల

 బ్రహ్మ ఆనందం’ నుంచి సెకండ్ సింగిల్ ‘విలేజ్ సాంగ్’ విడుదల

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి చేతుల మీదుగా ప్రముఖ సంస్థ స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యూనిక్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన ‘బ్రహ్మ ఆనందం’ నుంచి సెకండ్ సింగిల్ ‘విలేజ్ సాంగ్’ విడుదల

మళ్ళి రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకుంది. హ్యాట్రిక్ హిట్ల తరువాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు ‘బ్రహ్మ ఆనందం’ అనే చిత్రంతో వస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌కి ఇది నాలుగో ప్రాజెక్ట్. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ‘బ్రహ్మ ఆనందం’ టీజర్ అందరినీ నవ్విస్తూనే గుండెకు హత్తుకునే ఎమోషన్స్‌ను చూపించింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ను పెంచేశారు.

ఇందులో భాగంగా 'విలేజ్ సాంగ్' అనే రెండో పాటను సోమవారం నాడు మేకర్లు రిలీజ్ చేశారు. ఈ పాటను ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు. ఈ పాటకు శాండిల్య పిసాపాటి బాణీ అందరినీ హత్తుకునేలా ఉంది. సురేష్ బనిశెట్టి రాసిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే బ్రహ్మానందం, రాజా గౌతమ్ మధ్య సన్నివేశాల్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. రామ్ మిరియాల గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌ అయింది. ఆయన గాత్రంలో ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనే కుతుహాలాన్ని పెంచేస్తోంది.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. శాండిల్య పిసాపాటి సంగీతం సమకూర్చగా, మితేష్ పర్వతనేని కెమెరా మెన్‌గా, ప్రణీత్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.

నటీనటులు :
 రాజా గౌతమ్, "పద్మశ్రీ" బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు

సాంకేతిక బృందం:
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
దర్శకుడు: Rvs నిఖిల్
DOP: మితేష్ పర్వతనేని
సంగీత దర్శకుడు: శాండిల్య పిసపాటి
ఎడిటర్: ప్రణీత్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.వంశీకృష్ణా రెడ్డి, పి.దయాకర్ రావు  


#telugufocustv #telugunews #bramhanandammovie #filmnews #cinema #bramhanandammovie

త్వరలో విడుదలకు సిద్దమవుతున్న “మిస్టీరియస్”

 త్వరలో విడుదలకు సిద్దమవుతున్న  “మిస్టీరియస్”

మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన “మిస్టీరియస్” (MissTerious) తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్, అబిద్ భూషణ్ ( నాగభూషణం మనవడు), రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్), రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో  
త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ఉష మరియు శివాని సమర్పణలో ఆష్లీ క్రియేషన్స్ (Ashley Creations)  బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి మరియు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది, ఆడియో లాంచ్ త్వరలో షెడ్యూల్ చేయబడుతుంది.
దర్శకుడు మహి కోమటి రెడ్డి మాట్లాడుతూ మిస్టీరియస్ చిత్రం ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా నిర్మించాము.  చిత్రకథ మరియు స్క్రీన్ ప్లే సునిశితంగా రూపొందించిన ఈ చిత్రం క్రమక్రమంగా క్లూలను బహిర్గతం చేస్తూ ప్రేక్షకులను చివరి వరకు ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ చిత్రం షాకింగ్ ట్విస్ట్ లు కథను కొత్త ఎత్తులకు తీసుకెల్లి వీక్షకులను రంజింప చేస్తుంది, యాక్షన్స్, థ్రిల్లింగ్  ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి అని వివరించారు.

చిత్రాన్ని ఉన్నత విలువలతో రూపొందించడానికి అన్ని విధాలుగా సహకారం అందించిన నిర్మాతను ఆయన అభినందించారు.

నిర్మాత జయ్ వల్లందాస్ (USA) మాట్లాడుతూ, ఎక్కడ రాజీ పడకుండ నిర్మిస్తున్న ఈ సినిమాలో మూడు మంచి పాటలు ఉన్నాయని, సంగీత దర్శకుడు M.L రాజా మధురమైన సంగీతాన్ని అందించారని త్వరలోనే ఆడియోను రిలీజ్ చేస్తామని చెప్పారు. క్లైమాక్స్ వరకు ఉత్కంఠను నింపడం  ఈ చిత్రం మాస్టర్ క్లాస్ అని అన్నారు.
మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం ప్రత్యేకం అని  అన్నారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ తర్వాత త్వరలో విడుదల కానుంది.

నటీనటులు :   ప్రధాన తారాగణం:
రోహిత్ (బిగ్ బాస్ ఫేమ్), రియా కపూర్ (హీరోయిన్), అబిద్ భూషణ్ (ప్రముఖ నటుడు రక్త కన్నీరు నాగభూషణ్ మనవడు), మేఘనా రాజపుత్ (హీరోయిన్), బలరాజ్ వాడి (కన్నడ నటుడు), ఆకునూరి గౌతమ్,భోగిరెడ్డి శ్రీనివాస్, రాజమౌళి(జబర్దస్త్), గడ్డం నవీన్ (జబర్దస్త్), లక్ష్మి,,వేణు పోల్సాని  

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహి కోమటిరెడ్డి
నిర్మాత:  జయ్ వల్లందాస్ (USA)
పాటలు మరియు సంగీతం: ML రాజా
కెమెరా & ఎడిటింగ్:   పరవస్తు దేవేంద్ర సూరి (దేవా)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  రామ్ ఉప్పు
పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి.

#telugufocustvnews #telugunews #MissTerious #MissTeriousmovie #filmnews


తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదగా రమేష్ స్టూడియోస్ ఘన ప్రారంభం

 తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదగా రమేష్ స్టూడియోస్ ఘన ప్రారంభం

ఈరోజు మణికొండలోని ఓయూ కాలనీలో రమేష్ స్టూడియోస్ ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం సంపూర్ణ సూపర్ మార్కెట్ పైన రమేష్ స్టూడియోస్ ఏర్పాటు ప్రారంభించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ రమేష్ స్టూడియోస్ ను అలాగే డిఐ సూట్ ఓపెన్ చేయడం జరిగింది. తెలుగు చిత్ర నిర్మాత మండలి ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా డబ్బింగ్ థియేటర్ ప్రారంభించడం జరిగింది. ఆలేరు ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ అయిన బీర్ల ఐలయ్య గారి చేతుల మీదగా ఎడిటింగ్ రూమ్ ఓపెన్ కావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి గారి చేతుల మీదగా రెండవ సెకండు సూట్ ఓపెన్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర గారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ & చత్రపురి ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు, నల్గొండ డిసిఎంఎస్ చైర్మన్ బొల్లా వెంకట రెడ్డి గారు, ఇంకా పలువురు కౌన్సిలర్స్ అలాగే సినీ ప్రముఖులు పాల్గొని రమేష్ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 

#telugufocustv #telugunews #komatireddyvenkatreddy #telugunews #telangananews 



దళపతి విజయ్ సెన్సేషనల్ మూవీ టైటిల్ ‘జన నాయగన్

 కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న దళపతి విజయ్ సెన్సేషనల్ మూవీ టైటిల్ ‘జన నాయగన్'

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చేస్తున్న చివరి సినిమా మీద అంచనాలు భారీ స్తాయిలో నెలకొన్నాయి. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రారంభించారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

‘జన నాయగన్’ అనే టైటిల్‌తో దళపతి విజయ్ చివరి చిత్రం రాబోతోంది. ఈ టైటిల్ పోస్టర్‌లో దళపతి విజయ్ ఎంతో స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌లోని సెల్ఫీకి, ఆ టైటిల్‌కి న్యాయం చేసినట్టుగా కనిపిప్తోంది. ఈ మూవీని విజయ్‌కి ఫేర్ వేల్‌గా ఉండబోతోంది. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుంది.

జ‌న నాయ‌గ‌న్ అనే మూవీ టైటిల్‌ అర్థం అందరికీ తెలిసిందే. జన నాయకుడు.. పీపుల్స్ లీడర్.. ప్రజా నాయకుడు అని అర్థం వస్తుంది. ఇన్నేళ్లలో విజయ్ చేసిన సేవా కార్యక్రమాలు, సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు చిహ్నంగా ఈ టైటిల్ ఉంది. ఈ చిత్రంతో అనిరుధ్ మరోసారి తన సంగీతంతో విజయ్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు సిద్దంగా ఉన్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. అదిరిపోయే లైనప్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ మున్ముందు మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించనుంది.
మరిన్ని వార్తలకోసం మా @telugufocustvnews యూట్యూబ్ ఛానల్ ని చూడండి.

#telugufocustv #telugunews #cinemanews #filmnews #politicalnews #vijaydalapathi #jananayagan

ఈ విజయం ప్రేక్షకులదే: బాక్సాఫీస్ సంబరం ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ భీమవరంలో బాక్సాఫీస్ సంబరం ఈవెంట్  నిర్వహించింది.  భారీగా హాజరైన అభిమానులు ప్రేక్షకులు సమక్షంలో ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మల్యే కామినేని శ్రీనివాసరావు ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.

బాక్సాఫీస్ సంబరం ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. హాయ్ భీమవరం అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం..వచ్చాం, కొట్టాం. ఇదంతా మీదే. భీమవరం ప్రేక్షకులు ఎప్పుడూ నా గుండెల్లో వుంటారు. ఇది మంచి హిట్ సినిమా చేస్తున్నాం అనుకున్నాం. కానీ దిన్ని మీరు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేసినందుకు థాంక్ యూ. వంద, రెండు వందలు, మూడు వందలు కోట్లు అంటున్నారు. ఇది మీరు ఇచ్చారు.  ఈ సినిమా క్రెడిట్ అనిల్ అండ్ టీంకి దక్కుతుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ కి థాంక్ యూ. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ రాదు.  ఐశ్వర్య మీనాక్షి కి మరిన్ని హిట్లు రావాలని కోరుకుంటున్నారు. అందరి హీరో అభిమానులకు థాంక్ యూ. మీ ప్రేమ ఇలానే వుంటే మళ్ళీ సంక్రాంతి వస్తాం. మరో బ్లాక్ బస్టర్ ఇస్తాం. నిర్మాతలు దిల్ రాజు అండ్ శిరీష్ కి థాంక్స్. అందరికీ పేరుపేరునా థాంక్ యూ' అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. హలో భీమవరం. అందరికీ బిగ్ థాంక్స్. బీమ్స్ గోదారి గట్టు పాట ఈ సినిమా సందడి మొదలైయింది. ఈ సినిమా పెద్ద హిట్ అయితే చాలు అనుకున్నాం. కానీ సినిమాని మీరు ఎక్కడితో తీసుకెళ్ళి పెట్టారు. ఇంత పెద్ద విజయాన్ని ఆడియన్స్ కి  బిగ్ థాంక్ యూ. ఎస్విసి బ్యానర్ నా ఫ్యామిలీ. ఇది వారితో ఆరో సినిమా. దిల్ రాజు గారికి శిరీష్ గారికి థాంక్ యూ. టీం అందరికీ థాంక్ యూ. మా విక్టరీ వెంకటేష్ గారికి చాలా థాంక్. ఈ సినిమా క్రెడిట్ ఆయనే దక్కుతుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. నేను వెంకటేష్ గారి అభిమానిని. ఆయన సినిమాకు చూసి విజల్స్ వేశాను. ఆయనలా జుట్టుపెచుకున్నాను. ఆయన సినిమాకి డైరెక్టర్ చేయడం గ్రేట్ హానర్. థాంక్ యూ సార్. పద్మభూషణ్ అవార్డ్ అందుకొనున్న బాలయ్య గారికి మా సినిమా తరపున బిగ్ కంగ్రాట్స్. ఈ సంక్రాంతిని మర్చిపోలేను. మీ ఆశీస్సులతో కుదిరితే ఇంకో సంక్రాంతి వస్తా' అన్నారు
నిర్మాత శిరీష్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షుకులకు థాంక్ యూ వెరీ మచ్' అన్నారు.హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ. సంక్రాంతి ఇంత పెద్ద గిఫ్ట్  ఊహించలేదు. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ' అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ భీమవరంలో చేసుకోవడం ఆనందంగా వుంది. వెంకటేష్ గారి మిస్ అయ్యాను. ముఖ్యంగా ఫుడ్(నవ్వుతూ). దిల్ రాజు గారికి శిరీష్ గారికి థాంక్ యూ. అనిల్ గారికి బిగ్ థాంక్స్. ఈ విజయాన్ని మర్చిపోలేను' అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద సక్సెస్ ఫుల్ సినిమాలో నన్ను పార్ట్ చేసిన అనిల్ గారికి వెంకటేష్ గారికి దిల్ రాజు గారికి శిరీష్ గారికి థాంక్ యూ. ఈ సినిమాలో పాటలు రాసిన రచయితలకు థాంక్. ఇందులో పాటలు పాడిన సింగర్స్ కి ముఖ్యంగా వెంకటేష్ గారికి థాంక్ యూ. ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని చేసిన అందరికీ థాంక్' అన్నారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

#telugufocustv #telugunews #sankranthikivasthunnam #venkatesh #anilravipudi