17 డిసెంబర్ 2025

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హఫీజ్ పేట్, సాయినగర్ లో అంగన్వాడీ భవనాలు. ప్రహరీ గోడ నిర్మించాలని

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ భవనాలు. ప్రహరీ గోడలను నిర్మించాలని  హాఫిజ్ పేట్ బీజేపీ అధ్యక్షులు కైతాపురం జితేందర్ డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్, సాయి నగర్ బస్తీ లోనీ అంగన్వాడీ కేంద్రంను సందర్శించి వివిధ సమస్యల వివరాలను  సేకరించడం జరిగిందని ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలకు ప్రహరీ గోడలు లేక ఇబ్బందులకు నిలయంగా మారాయని సంబంధిత అధికారులు వెంటనే నిర్మించాలని ఆయన కోరారు.
సాయినగర్ బస్తీలో అంగన్వాడీ కేంద్రంను కిర్బీ షీట్లతో రూమ్ ఏర్పాటు చేసి వదిలేశారని, విద్యుత్ వసతి లేక ఎండ వేడికి చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నారు,వాష్ రూమ్ లేవని , అంగన్వాడీ కేంద్రం ముందర మస్కా కుంట చెరువు ఉండడంతో, ప్రహరీ గోడ లేక పోవడం ప్రమాదకరంగా ఉన్నదన్నారు, మస్కా కుంట చెరువు మొత్తం చెత్త ,బురదతో ఆ ప్రాంతం దుర్వాసనతో ఉన్నదని, చెరువు వద్ద పరిశుభ్రత పాటించకపోవడం.అక్కడ కనీస వసతులు లేక చాలా ఇబ్బందిగా ఉంటున్నారన్నారు, 
అయ్యప్ప పాట వింటే సర్వశుభాలు కలుగుతాయి!
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , బీజేపీ జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్ , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, డివిజన్ బీజేపీ కార్యదర్శి సుబ్బారావు ,డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్.డివిజన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బాలరాజు , బీజేపీ నాయకులు శ్రీకాంత్ , కార్తీక్ , లోకేష్ , నిఖిల్ , నాగరాజు.స్థానిక బస్తీ వాసులు , మహిళలు పాల్గొన్నారు.

Raju Reporter
RR District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

14 డిసెంబర్ 2025

తెలంగాణ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం...

ఏ జిల్లా నుండి పేపర్ రిజిస్ట్రేషన్ అయితే అక్కడి వరకే అక్కడేషన్స్ సౌకర్యం...
ఆందోళనలో సంపాదకులు.. అక్రిడేషన్ సౌకర్యం రద్దయ్య... అవకాశం...
 తెలంగాణ పత్రికా సంపాదకులకు  గత 20 సంవత్సరాల నుండి  తీవ్ర అన్యాయం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.బి. రాజు డిమాండ్ చేశారు. 2002లో అప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయంలో జర్నలిస్టులకు బస్సు పాసులు. హెల్త్ కార్డులు మంజూరు చేసింది. ప్రస్తుత ప్రభుత్వాలు మాత్రం పత్రిక సంపాదకుల పైన కరుడుగట్టిన నేరస్తులను చూసినట్లుగా ప్రభుత్వాలు.  అవగాహనలేని ప్రెస్ అకాడమీ చైర్మన్లు. నిర్లక్ష్యపు దూరనిలో నిర్లక్ష్యపు ధోరణిలో  నడుస్తున్నాయని ఆరోపించారు. ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసాలలో కొత్త కార్డులు ఇవ్వకుండా పాత కార్డులను మార్పిడి చేసుకుంటూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వం  కనీసం పత్రిక ఎడిటర్లకు. కెమెరామెన్ లకు న్యూస్ సేకరణ కోసం జిల్లా రాష్ట్ర పాసులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంత ప్రభుత్వానికి కాకపోతే నియోజకవర్గస్థాయి జర్నలిస్టులకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. నిమ్మకు నీరెత్తినట్లుగా కెసిఆర్. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికలపై చిన్న చూపు చూడడం వల్ల ఎన్నికలలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ప్రభుత్వాలు గమనించడం లేదని కే.బి.రాజు స్పష్టం చేశారు. 
మహబూబ్నగర్ జిల్లాలో చాలామంది పాత్రికేయులు అక్రిడేషన్ సౌకర్యం లేక రోడ్డున పడ్డ సంబంధిత కలెక్టర్ డి పి ఆర్ ఓ లు నేటి వరకు పట్టించుకున్న పాపంసంబంధిత కలెక్టర్ డి పి ఆర్ ఓ లు నేటి వరకు పట్టించుకున్న పాపనపోలేదని సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొన్ని పత్రిక యాజమాన్యాలు అక్రిడేషన్ కార్డులను పదివేల నుండి 20వేల వరకు అంతర్గతంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి ధోరణి వల్ల విలేకరి చేసేది ఒక పత్రిక అక్రిడేషన్ కార్డు మరొక దినపత్రికతో సంబంధాలు పెట్టుకుని నడిపిస్తున్నారు. ఇలాంటి వ్యవహారానికి చరమగీతం పాడవలసిన రోజులు ఆసన్నమయ్యాయని. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఇటీవల పత్రికలలో కొన్ని మార్పులు తెచ్చిన విధివిధానాలు ఈ విధంగా ఉన్నాయి. ఏ జిల్లాలో అయితే స్థానికేతరుడుగా ఉండి అక్కడి సంబంధిత ఆర్డిఓ దగ్గర నుండి ఆర్ఎన్ఐ చేయించుకున్న వారికి అక్కడి జిల్లా వరకే పరిమితం అవుతుందని. ఇతర జిల్లాలో అక్కడేషన్ ఆ పత్రిక చెల్లుబాటు కాదని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇలాంటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అక్కడ జిల్లాల నుండి అయినా అక్రిడేషన్ సౌకర్యము విలేకరులకు కల్పించాలని పత్రికా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది 

రంగారెడ్డి. (కే.బి.రాజు)

మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

06 డిసెంబర్ 2025

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇదీ పరిస్థితి!

ఇండిగో విమానాలు రద్దవడంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లలో దారుణ పరిస్థితులు
వరుసగా నాలుగో రోజు ఇండిగో విమానాలు రద్దు
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటికే రద్దైన 69 ఇండిగో విమానాలు.
దీంతో ప్రయాణికులతో, సూట్‌కేసుల కుప్పలతో రైల్వే స్టేషన్‌లా దారుణంగా మారిన హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ, చెన్నై సహా పలు ఎయిర్‌పోర్ట్‌లు.

Raju Sr Reporter
RR District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

04 డిసెంబర్ 2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై బిజెపి ఆధ్వర్యంలో నిరసన... బిజెపి సీనియర్ నేత రవికుమార్ యాదవ్ పిలుపు...

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిగా అమలు చేయలేదని నేటి వరకు పెండింగ్లోనే ఉన్నాయని  శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి కాంటెస్ట్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందుబాటులో లేవని వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని గురువారం ఆయన స్వగృహంలో  నిర్వహించిన జిల్లా.జిల్లా నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులతో సంయుక్తంగా  ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ నాయకులతో మాట్లాడుతూ ఈనెల ఏడవ తేదీన ఇందిరా పార్కులో  భారీ ఎత్తున బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరుగుతుందని పిలుపునిచ్చారు. అనంతరం రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా  అధ్యక్షురాలు కొత్తపల్లి పద్మ మాట్లాడుతూ  బిజెపి నేతలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ దేవుళ్ళ పైన  వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆమె  వ్యాఖ్యానించారు. వాటిని వెంటనే వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మేరీ సలోమాన్. సరోజా రెడ్డి. స్వగృహ విజయలక్ష్మి. 106 డివిజన్ మహిళా మోర్ఛ ప్రధాన కార్యదర్శి ఆదిలక్ష్మి. ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి. ప్రధాన కార్యదర్శి స్వప్న. రాణి లతోపాటు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టాలని   బిజెపి ఆధ్వర్యంలో నిరసన... బిజెపి సీనియర్ నేత రవికుమార్ యాదవ్ పిలుపు...

Raju Sr Reproter
RR District 
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

02 డిసెంబర్ 2025

గోపీ చెరువుకు దారేది...? జిహెచ్ఎంసి అధికారులు చర్య తీసుకోండి...!

నుమరుగవుతున్న గోపీ చెరువునాలా...
కట్టపై రాళ్లు వేసి అక్రమనకు గురి... చెరువుకు దారేది...?
జిహెచ్ఎంసి అధికారులు చర్య తీసుకోండి...!

గోపి చెరువులోకి రాజీవ్ గృహకల్ప నుండి మురికి నీరు వెళ్లే విశాలమైన నాలాపైన రాళ్లు వేసి కబ్జాకు గురిచేశారు. గోపి చెరువుగోపి చెరువుకు వెళ్లడానికి దారులు లేకుండా పెద్దపెద్ద బండ రాళ్లు చెత్త చెదారంతో నింపి వేయడంతో  ప్రభుత్వ స్థలాన్ని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కబ్జా చేయడానికి కట్టుదిట్టమైన ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు పాపి రెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్పలో జరగడం సర్వసాధారణంగా మారింది. ఇక్కడ ప్రజలను రక్షించే పాలకులే భూములను భక్షించే డేగాలుగా మారిపోయారు.

చెరువులలోకి కూడా వెళ్లకుండా చెరువుల దారులను మూసివేసి కబ్జాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంఘటన శేరిలింగంపల్లి 106 డివిజన్లో జరిగింది. ఇలాంటి సంఘటనలో ఇక్కడ ఉన్నవారికి అలవాటు పడింది. ఇలాంటి సంఘటనలు ఎవరి ద్వారా వస్తున్నాయి. ఎందుకు జరుగుతుంది. అనే సమస్యలను జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి వెళ్లకుండా ఎక్కడికక్కడే ఇలాంటి అస్తవ్యస్తమైన పనులకు కొంతమంది శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఇలాంటి సమస్యల పైన జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ చర్యలు తీసుకొని గోపీ చెరువులోకి ప్రజలు వెళ్లడానికి నాలా పైన వేసిన రాళ్లను మురికి చెత్తను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఎవ్వరికి దొరికినంత వారు దోచుకోవడమే ఈ కాలనీలో జరుగుతున్న పరిస్థితులు జిహెచ్ఎంసి. ఎమ్మార్వో. నేటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు, కండ్లకు కనిపిస్తున్న వైనాలు కూడా స్థానిక కార్పొరేటర్కు కనిపించినా నాకెందుకులే అన్న చందంగా వ్యవహరించడంతో ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. ఇక్కడ నాలాకు ఒక అప్డేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని నాలాను విశాలంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Raju Sr Reporter.
RR District.
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews