హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ భవనాలు. ప్రహరీ గోడలను నిర్మించాలని హాఫిజ్ పేట్ బీజేపీ అధ్యక్షులు కైతాపురం జితేందర్ డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్, సాయి నగర్ బస్తీ లోనీ అంగన్వాడీ కేంద్రంను సందర్శించి వివిధ సమస్యల వివరాలను సేకరించడం జరిగిందని ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలకు ప్రహరీ గోడలు లేక ఇబ్బందులకు నిలయంగా మారాయని సంబంధిత అధికారులు వెంటనే నిర్మించాలని ఆయన కోరారు.
సాయినగర్ బస్తీలో అంగన్వాడీ కేంద్రంను కిర్బీ షీట్లతో రూమ్ ఏర్పాటు చేసి వదిలేశారని, విద్యుత్ వసతి లేక ఎండ వేడికి చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నారు,వాష్ రూమ్ లేవని , అంగన్వాడీ కేంద్రం ముందర మస్కా కుంట చెరువు ఉండడంతో, ప్రహరీ గోడ లేక పోవడం ప్రమాదకరంగా ఉన్నదన్నారు, మస్కా కుంట చెరువు మొత్తం చెత్త ,బురదతో ఆ ప్రాంతం దుర్వాసనతో ఉన్నదని, చెరువు వద్ద పరిశుభ్రత పాటించకపోవడం.అక్కడ కనీస వసతులు లేక చాలా ఇబ్బందిగా ఉంటున్నారన్నారు,
అయ్యప్ప పాట వింటే సర్వశుభాలు కలుగుతాయి!
అయ్యప్ప పాట వింటే సర్వశుభాలు కలుగుతాయి!
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , బీజేపీ జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్ , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, డివిజన్ బీజేపీ కార్యదర్శి సుబ్బారావు ,డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్.డివిజన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బాలరాజు , బీజేపీ నాయకులు శ్రీకాంత్ , కార్తీక్ , లోకేష్ , నిఖిల్ , నాగరాజు.స్థానిక బస్తీ వాసులు , మహిళలు పాల్గొన్నారు.
Raju Reporter
RR Districtమరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి.
#telugunews #telugufocustv #telugufocustvnews

