మనలో చాలా మందికి రహాస్యాలు అంటే చాలా ఇంట్రస్ట్ గా చూస్తాం, వింటాం, అలాంటిదే ఇప్పుడు ఒక రహస్యం చూద్దాం.సుమారు 400 సంవత్సర నుండి కుతుబ్ షాహిలా రాజ్యానికి రాజధానే గొల్కొండ కోట, ఈ గొల్కొండ కోట కాకతీయ్యుల కాలంలో క్రీ.శ 1143 నిర్మించారు.ఓరుగల్లుని పాలించిన ప్రభువు కృష్ణదేవ్ దీనిని క్రీ.శ 1363 లో బహమది సూల్తాన్ మొదటి మహ్మద్ షాకు అప్పగించారు. బహమనిరాజ్యం పతనం అవుతున్న సందర్భంలో సూల్తాన్ కులి కుథుబ్ షా క్రీ.శ 1518 లో స్వతంత్ర రాజై గొల్కొండను రాజధానిగా చేసుకుని పట్టాభిషేకం చేసుకున్నాడు.
తర్వాత ఇబ్రహిం కుతుబ్ షానా కాలంలో గొల్కొండ నగర జనాబా పెరిగిపోయింది.నీటి వసతులు సరగా లేకుండా అంటువ్యాధులు ప్రభలినాయి, పట్టణాన్ని విస్త్రతపరచడం కోసం మూసీనదిపైన పురానాపుల్ నిర్మించాడు.ఇబ్రహిం కుతుబ్ షా మరణించిన తర్వాత అతని కుమారుడు కులికుతుబ్ షా నూతన నగరం నిర్మించాలని మూసినది వడ్డున నిర్మించిన నగరమే భాగ్యనగరం(హైదరాబాద్). మూసినది నడ్డిన నిర్మించిన ఈ నగరాన్ని తన ప్రియురాలికి బాగ్ మతి పేరుని పెట్టాడు. బాగ్యనగరం అని పిలిచాడు. ప్రపంచ సుందర నిర్మాణాలలో హైదరాబాద్ లోని ఛార్మినార్ ఒక్కటి. ఇది క్రీ.శ 1792 లో మహ్మద్ కులీకుతుబ్ షా నిర్మించారు. ఈయన అరబ్, ఊర్దు, పర్షియన్, తెలుగు బాషలలో పాండిత్యం కలవాడు. ఊర్దు,తెలుగు బాషల్లో కూడ కవితలు రాశాడు. ఇయన భాగ్ మతి అనే బంజారా స్త్రీని ప్రేమించి 1589 లో పెళ్లిచేసుకున్నాడు.పెళ్లైన తర్వాత బాగ్ మతి ఇస్లాం మతాన్ని స్వీకరించి హైదర్ మహల్ అని పేరు మార్చుకుంది. దానిని అనుసరించి హైదరాబాద్ గా మారింది. కులీకుతుబ్ షా 1611 లో చనిపోయాడు. అదే సంవత్సరంలోనే బాగ్ మతి కూడ చనిపోయింది.తర్వాత గొల్కొండ కోటను సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా తో పాటుగా చివరిగా అబుల్ హసన్ కుతుబ్ షా కూడ పరిపాలించాడు. తానీషా కంటే చక్రవర్తిగా ఉన్న తానిషా మామ అబ్దుల్లా కుతుబ్ షాని డక్కన్ లో మొగల సేనానిగా ఉన్నఔరంగజేబు ఓడించి, మొగల్ చక్రవర్తి అయిన షాజహాన్ సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టె విధంగా అంగీకరించాడు. మొగలుల దండయాత్ర నుండి గొల్కొండను రక్షించడానికి మహారాష్ట్ర రాజైన శివాజీతో అబుల్ హసన్ సంది కుదుర్చుకున్నాడు. 1680 లో శివాజీ మరణం తర్వాత 1685 లో ఔరంగజేబు తన కుమారుడైన షా ఆరమ్ నాయకత్వంలో గొల్కొండపైన దండయాత్ర చేశాడు.మొదట గొల్కొండకే విజయం లభించినా కొంతమంది సేనానులు నమ్మక ద్రోహం వలన గొల్కొండ సైన్యాలు ఓడిపోయాయి. పర్యవసానంగా అబుల్ హసన్ సందిచేసుకున్నాడు. కొన్ని శాసనాలు క్రింద అబుల్ హసన్ కోటి పన్నులు చెల్లించాలి. సంవత్సరానికి రెండు లక్షల పన్నులు చెల్లించాలి. అక్కన్న, మాధన్నలను ఉద్యోగాలనుంచి తొలగించాలి. మొగల్ సైన్య వెళ్లిన తర్వాత అబుల్ హసన్ జాప్యం చేశాడు. ఔరంగజేబు కోపానికి వీరేనని బావించిన కొందరు. అంతపుర స్త్రీలతో అక్కన్న,మాదన్నల హత్యకు కుట్ర పన్నారు. 1686 మార్చి 24 న రాత్రి సుల్తానులతో సంప్రదించి ఇంటికి వెలుతున్న వారిని నడివీధిలో హత్యచేశారు.1683 లోఅబుల్ హసన్ కట్టవలసిన పన్నులు సకాలంలో చెల్లించలేదు. ఔరంగజేబు 1687 లో పిబ్రవరి 7 న దండయాత్ర చేశాడు. తానిషా గొల్కొండ కోట పై దాడిని 8 నెలలపాటు అడ్డుకున్నాడు. 1687 అక్టోబర్ 3 వ తేదిన ఔరంగజేబు లంచం ఇచ్చి గొల్కొండ కోట తలుపులు తెరిపించి గొల్కొండ కోటను తన వశం చేసుకున్నాడు. తానిషాని బందిగా తీసుకెళ్లి దౌలతాబాద్ కోటలో బందిగా 13 సంవత్సరాలు బందిస్తే అక్కడ తానిష మరణించాడు. దాంతో కుతుబ్ షా వర్గం అంతమోదింది. దక్కన్ లో మొగళులు ఆద్వర్యంలో నిజాం పాలన 1701 లో ప్రారంభం అయ్యింది. అతి సుందరమైన పట్టనమే మన హైదరాబాద్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినది. అందరికి షేర్ చెయ్యండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి