మన జీవితాల్లో టీవీ, ఫోన్, ఇంటర్నెట్ చాలా ముఖ్యమైపోయింది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఎదైనా టికెట్ల బుకింగ్ ఇంటర్నెట్‌పైనే ఉంటేనే సాధ్యం, అలాంటి ఇంటర్నేట్ వాడాలంటే కంప్యూటర్,ల్యాప్ టాప్ ఉండాలి వాటికి డబ్బులు ఎక్కువ అవసరం కాబట్టి ప్రతివాళ్ళు మొబైల్ ఫోన్ తీసుకుని అందులోనే ఇంటర్నేట్ వాడుతున్నారు.ఇంటర్నెట్ వాడకం ప్రపంచ మొత్తం అనేక మార్పులు తీసుకువచ్చింది. అదే ముఖ్యంగా కుటుంబ సభ్యుల పక్కపక్కనే వున్నా వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాచింగ్, ఛాటింగ్, పోస్టింగ్, కామెంట్స్‌తోనే కాలం గడిపేస్తున్నాం. ఇంటర్నెట్ వాటకం ఒక వ్యసనంగా మారిపోయింది. దీని వల్ల ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని విశ్లేషకులు బావిస్తున్నారు.

ఇంటర్నెట్ డీ అడిక్షన్ క్లినిక్స్ - ఇంటర్నేట్ ఎక్కువగా వాడుతున్న నేపథ్యంలో దిల్లీలోని ఎయిమ్స్ తొలిసారిగా ఇంటర్నెట్ డీ అడిక్షన్ క్లినిక్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రంలో ఇంటర్నేట్ అనేది వ్యసనంగా మారిన వారికి ప్రతి శనివారం రోజున కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 2 సంవత్సరాల ముందు పదోతరగతిలో టాపర్‌గా వున్న విద్యార్థి ఇంటర్నెట్‌ను అదేపనిగా వాడకం మొదలుపెట్టిన్నాడు.తరువాత అతను చదువులో ఏమాత్రం రాణించలేకపోయాడు. కారణం అతనికి ఏకాగ్రత, శ్రద్ద లేకపోవడమేనని అతని తల్లిదండ్రులు చెప్పారు. ఇంటర్నెట్ ను వాడటం మాన్పించేందుకు అనేక రకాల ప్రయత్నించిన ఆ విద్యార్థిలో ఎటువంటి మార్పులు తీసుకురాలేదు.దీంతో ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. వాళ్లకి తల్లిదండ్రులు నమ్మలేని నిజం ఒకటి చెప్పారు. అన్నదమ్ములిద్దరు ఇంటర్నేట్ చూస్తుండగా ఇంట్లోకి దొంగలు వచ్చి దొంగతనం చేసుకుని వెళ్తుంటే వారిని చూసి కూడ పట్టించుకోకుండా ఉండిపోయారట. చిన్న వయస్సులోనే పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం, టీవీ చూపించడం, ఇంటర్నేట్ వాడటం, లాంటివి కట్టడిచేయకపోతే పిల్లల్లో, పెద్దల్లోను అనేక సమస్యలకు దారి తీస్తుందని వైద్యనిపుణులు తెల్చి చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరు 6 నుండి 8 గంటలు నిద్ర తప్పని సరిగా ఉండాలి ఎంతోమంది రాత్రి 2,3 గంటల వరకు ఇంటర్నేట్ లోను, ఫోన్, టీవీ చూడటం లాంటివి చేస్తున్నారు. ఇటువంటివి తగ్గించి ముందు ముందు వచ్చె సమస్యలకు దూరంగా ఉండండి. ప్లీజ్ ఇది అందరికి షేర్ చెయ్యండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి