31 అక్టోబర్ 2025

150 వ జయంతి సందర్భంగా పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు... బిజెపి నేత కొత్తపల్లి పద్మ.

 భారత మాజీ ఉప ప్రధాని  ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను శుక్రవారం ఫతే మైదాన్ బషీర్బాగ్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి పరువు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రంగారెడ్డి జిల్లా నాయకురాలు కొత్తపల్లి పద్మ మాట్లాడుతూ భారతదేశానికి మాజీ ఉప ప్రధాని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. వేలాది మంది మహిళా కార్యకర్తలు  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో అన్ని కులాల వారికి న్యాయం జరిగే చట్టాలను అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు, ఉమ్మడి రాష్ట్రాలను సైతం లెక్కచేయకుండా అభివృద్ధి తన లక్ష్యంగా భావించారు.
జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీలలో ప్రచారాన్ని వేగవంతం చేశారు, కాంగ్రెస్ టిఆర్ఎస్ కంటే భారతీయ జనతా పార్టీ ప్రచారంలో నిమగ్నమయ్యారు, కిరాణా షాపులు, ఇండ్లలోకి వెళ్లి  మహిళలకు పూసగుచ్చినట్లు  కమలం గుర్తుకు ఓటు వేయాలని, అలాంటి సమయంలో  బిజెపి మనకు అహర్నిశల అందుబాటులో ఉంటుందని కొత్తపల్లి పద్మ తెలిపారు, ఏ ఇంటికి ప్రచారానికి వెళ్లిన మహిళలకు పూసగుచ్చినట్లు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను  ఓటర్లకు గుర్తుండేలా చెబుతున్నారు,


మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి. #telugunews #telugufocustv #telugufocustvnews

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి