కండ్లు మూసుకున్న కార్పొరేటర్...
హైడ్రా కమిషనర్ పర్యవేక్షణ లోపం...
కబ్జాలను తొలగిస్తారా... ప్రజలనే తొలగించ మంటరా...
చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కన్నుమూసి కన్ను తెరిచే లోపే కబ్జాలకు గురి చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు, కార్పోరేటర్లు, ఎమ్మెల్యేల పర్యవేక్షణ లోపం కారణంగా గోపీ చెరువు ఎక్కడికక్కడే కనుమరుగవుతుంది. 2017 నుండి ఈ చెరువును ఒక ప్రక్క ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం. మరోపక్క పాపి రెడ్డి కాలనీ ప్రజలు. మరోపక్క రాజకీయ నాయకుల అండదండలతో గోపి చెరువు కనుమరుగవుతున్న నేటి వరకు స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తూతూ మంత్రంగా పరిపాలన వ్యవస్థ నడుస్తుంది తప్ప. ఇక్కడ ఎంత అవినీతి జరిగినా నేటి వరకు పట్టించుకున్న పాపాన్న పోలేదని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు, ఎక్కడ చూసినా అవినీతికి నిలయంగా శేరిలింగంపల్లి 106 డివిజన్ రాజీవ్ గృహకల్ప, పాపి రెడ్డి కాలనీ, గోపి నగర్ ప్రజలు ప్రభుత్వ భూములను నాలాలను దర్జాగా గోపి చెరువులో మట్టి పోసి దాంట్లోనే ఇండ్ల నిర్మాణం చేపట్టిన అవగాహన లేని కార్పోరేటర్ నిర్లక్ష్యం వల్లనే చెరువు పరిస్థితి రెంటికి చెడిన రేవడిల తయారయిందని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. రాజీవ్ గృహకల్పలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగిన అగ్నిమాపక వాహనం కూడా రాకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ప్రజలు ఎక్కుబిక్కు నా అల్లాడిపోయే పరిస్థితులు బిక్కుబిక్కునా అల్లాడిపోయే పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి పరిస్థితులలో వర్షాలు బాగా పడడంతో గోపీచంద్వర్షాలు బాగా పడడంతో గోపీ చెరువు నిండుకుండలా తలపించి లింగంపల్లి అండర్పాస్ రైల్వే బ్రిడ్జిలో నీరు నిండిపోయి ప్రతిసారి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న అవగాహన లేని కార్పొరేటర్ జిహెచ్ఎంసి సిబ్బంది జోనల్ కమిషనర్. ఎమ్మెల్యే తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో ఇక్కడి ప్రజలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని గోపీ చెరువులోకి వచ్చే నీటి పైన ఉన్న నాళాలపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ నిర్మాణాలను శేరిలింగంపల్లి ఎమ్మార్వో. జోనల్ కమిషనర్ స్పందించి రోడ్లకు ఇరువైపులా ఉన్న డబ్బాలతో పాటు గోపి చెరువు నాలాల పైన కట్టిన బిల్డింగులను కూల్చివేసి గోపి చెరువును ఆదుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఇండ్ల ముందు నిరాహార దీక్షలు చేపడతామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అడ్డగోలు నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోని ఎమ్మెల్యే. కార్పొరేటర్లు ఏం చేస్తున్నారో ముఖ్యమంత్రి ప్రశ్నించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
Raju Sr Reporter
RR District
మరిన్ని వార్తల కోసం @telugufocustv ఛానల్ ని చూడండి.
#telugunews #telugufocustv #telugufocustvnews
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి